జుట్టు బాగా రాలుతుందా?
Velpula Bharath Rao
02 December 2025
ఈ రోజుల్లో జుట్టు రాలడం అనే సమస్య సర్వసాధారణం. యువతీ, యువకుల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
ఇది పెద్ద విషయంగా అనిపించకపోయినా, ఒక్కోసారి ఇది మన కాన్ఫిడెన్స్‌ను తగ్గిస్తుంది. ఇది ఒక్కోసారి మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది.
సాధారణంగా జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉండవచ్చు, వాటిలో ఒకటి నీళ్లు చేంజ్ అవ్వడం..
నీళ్లు చేంజ్ అవ్వడం వల్ల జట్టు నాణ్యత తగ్గిపోతుంది. దీంతో జట్టు పల్చబడుతుంది. తలలోని తేమ పోయి జుట్టు పొడిబారుతుంది.
ఇది జుట్టు బలహీనంగా, ఊడిపోవడానికి కూడా కారణమవుతుంది. అలాగే, జుట్టులోని సహజ తేమను కూడా తొలగిస్తుంది.
నీటిని శుద్ధి చేయడానికి ఫిల్టర్ ఉపయోగించండి. ఇది నీటి నాణ్యతను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా జుట్టుకు హాని కలిగించదు.
జుట్టు తేమ కోసం మాయిశ్చరైజర్లతో షాంపూలు, కండీషనర్లను ఉపయోగించండి. ఇది జుట్టు పొడిబారకుండా చేస్తుంది.
జుట్టు ఆరోగ్యం కోసం, మీ ఆహారంలో ప్రోటీన్, విటమిన్లు, మినరల్ రిచ్ ఫుడ్స్‌ను చేర్చుకోండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
శీతాకాలంలో నారింజ తినొచ్చా?
వయసుకు గాలం వేసి.. అందాన్ని అందలం ఎక్కించే బటర్ ఫ్రూట్!
ముఖానికి కొబ్బరి నూనె రాస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి