Elon Musk: పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

Elon Musk: పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

Anil kumar poka

|

Updated on: Jan 02, 2025 | 6:27 PM

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపునకు కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ట్రంప్‌ తీసుకునే నిర్ణయాల్లో కూడా మస్క్ జోక్యం అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో డెమోక్రాట్లు ప్రెసిడెంట్‌ మస్క్‌ అంటూ విమర్శలు కూడా చేశారంటే అమెరికా రాజకీయాల్లో ఆయన పాత్ర అర్ధమవుతోంది. అంతేకాదు మస్క్‌ సాంకేతికంగా అందరికంటే ముందే ఉంటారు.

మస్క్‌ విజన్‌ ఎప్పుడూ ఓ 30 ఏళ్లు ముందే ఉంటుంది. ఈ క్రమంలోనే మస్క్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా అంగారక గ్రహంపై పాలనా విధానం ఎలా ఉండాలనుకుంటున్నారో వెల్లడించారు. భవిష్యత్తులో అంగారక గ్రహంపై మానవాళి స్థిర నివాసం ఏర్పరచుకున్నాక.. అక్కడ పాలనావ్యవస్థ ఎలా పని చేస్తుంది? అంటూ ఓ నెటిజన్ పోస్టు చేశారు. దానికి మస్క్ సమాధానమిస్తూ.. తమను ఎలా పాలించాలో అక్కడున్నవారే నిర్ణయించుకుంటారని, ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాకుండా, ప్రజలే స్వయంగా తమ నిర్ణయాలు తీసుకునే ‘ప్రత్యక్ష ప్రజాస్వామ్యా’నికే తన ఓటు అని వెల్లడించారు. ‘స్పేస్‌ఎక్స్‌’కు చెందిన స్టార్‌షిప్‌ ద్వారా మరో రెండేళ్లలో మానవరహిత, నాలుగేళ్లలో మానవసహిత అంగారక యాత్రలు చేపడతామని ధీమా వ్యక్తంచేశారు. గతంలో చెప్పినదానికంటే ముందుగానే ఈ ప్రయాణం ఉండొచ్చని తెలుస్తోంది.

మరో గ్రహంపై మానవాళి జీవనం సాగించాలని గత కొంతకాలంగా బలంగా వాదిస్తున్న మస్క్‌ ఆ దిశగా ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారు. అంగారకుడిపైకి 10 లక్షల మందిని తరలించేందుకు ఓ గేమ్‌ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ పోస్టు కూడా పెట్టారు. దాని సారాంశమేమిటంటే.. రెండేళ్ల నుంచి ఐదేళ్లలోపే ఆ గ్రహంపైకి మానవరహిత యాత్ర విజయవంతమవుతుంది. నాలుగేళ్ల నుంచి 10 ఏళ్లలోపే అక్కడికి మనుషులను కూడా పంపించగలుగుతాం. 20 ఏళ్లలో ఓ నగరాన్ని నిర్మిస్తాం. కచ్చితంగా వచ్చే 30 ఏళ్లకు అక్కడ సురక్షితంగా నాగరికత విరాజిల్లుతుంది’’ అంటూ మస్క్‌ తెలిపారు. భవిష్యత్తులో అంగారక గ్రహంపై చేపట్టే ప్రయోగాల కోసం స్పేస్ఎక్స్‌ సంస్థ ‘స్టార్‌షిప్‌’ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ను అభివృద్ధి చేస్తోంది. 500 అడుగుల పొడవు ఉండే ఈ వాహక నౌక ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్‌ హెవీ రాకెట్ల కంటే 20శాతం పెద్దది కావడం విశేషం. ఈ రంగంలో మస్క్‌ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.