Lok Sabha Election Phase 4 dates: 4వ దశలోనే ఏపీ, తెలంగాణ ఎన్నికలు.. యుద్దానికి సిద్దమైన రాజకీయ పార్టీలు..
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సీఈసీ. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మార్చి 16న మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. మొత్తం దేశ వ్యాప్తంగా 7 ఫేస్లలో ఎన్నికలు జరగనున్నాయని ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సీఈసీ. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మార్చి 16న మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. మొత్తం దేశ వ్యాప్తంగా 7 ఫేస్లలో ఎన్నికలు జరగనున్నాయని ప్రకటించారు. నాల్గవ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్గడ్ తోపాటు మరిన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు కేంద్ర ఎన్నికల కమిషనర్.
నామినేషన్లకు సంబంధించి తేదీలు విడుదల చేశారు. ఈ 4వ ఫేజ్ కి సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవడానికి గడువు ఇచ్చారు. ఏప్రిల్ 26న అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తారు. ఒకవేళ నామినేషన్ వేసిన అభ్యర్థులు వాటిని ఉపసంహరించుకునేందుకు ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చారు. ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు 96 ప్రధాన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కలిపి మొత్తం 10 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ మాత్రం మే 13న ఉంటుంది. ఫలితాలు జూన్ 4న విడుదల అవుతాయి.
ఈ 4వ విడతలో జరిగే ఎన్నికలు ఎన్నికలు తెలుగురాష్ట్రాల్లో కీలకంగా మారనున్నాయి. ఇటు తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించి లోక్ సభలో కూడా తన ఉనికిని చాటుకోవాలని ఉవ్విళూరుతోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ నాయకులు పక్కపార్టీల వైపు చూస్తున్నారు. ఇక బీజేపీ ఈ సారి 400 ఎంపీ స్థానాలే లక్ష్యంగా కదనరంగంలోకి దిగుతోంది. అందులో భాగంగా తెలంగాణలో కొంత పట్టు సాధించిన కమలదళం ఈ లోక్ సభ ఎన్నికలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. మొత్తం 17 స్థానాలకు గాను 12పైగా లోక్ సభ సీట్లలో విజయం సాధించాలని చూస్తోంది. అలాగే ఏపీలో కూడా ఈ సారి ఎన్నికలు హోరా హోరీ వాతావరణాన్ని తలపిస్తోంది. ఒక వైపు అధికార వైసీపీ వై నాట్ 175 అంటూ సిద్దం పేరుతో ప్రజల ముందుకు వచ్చింది. టీడీపీ మాత్రం జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా నేతల మధ్య నెలకొన్న అసమ్మతితో కాస్త గందరగోళంలో పడింది. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ రెండింటికీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో విజయం ఎవరికి వరిస్తుందో అని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రాంలో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే.
లోక్ సభ ఎన్నికలు – 4th ఫేస్ షెడ్యూల్ :
State Name | Constituency Name | Phase | Date |
Andhra Pradesh | Amalapuram | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Anakapalli | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Anantapur | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Aruku | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Bapatla | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Chittoor | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Eluru | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Guntur | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Hindupur | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Kadapa | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Kakinada | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Kurnool | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Machilipatnam | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Nandyal | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Narasaraopet | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Narsapuram | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Nellore | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Ongole | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Rajahmundry | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Rajampet | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Srikakulam | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Tirupati | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Vijayawada | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Visakhapatnam | Phase 4 | 13-May-24 |
Andhra Pradesh | Vizianagaram | Phase 4 | 13-May-24 |
Bihar | Begusarai | Phase 4 | 13-May-24 |
Bihar | Darbhanga | Phase 4 | 13-May-24 |
Bihar | Munger | Phase 4 | 13-May-24 |
Bihar | Samastipur | Phase 4 | 13-May-24 |
Bihar | Ujiarpur | Phase 4 | 13-May-24 |
Jammu & Kashmir | Srinagar | Phase 4 | 13-May-24 |
Jharkhand | Khunti | Phase 4 | 13-May-24 |
Jharkhand | Lohardaga | Phase 4 | 13-May-24 |
Jharkhand | Palamu | Phase 4 | 13-May-24 |
Jharkhand | Singhbhum | Phase 4 | 13-May-24 |
Madhya Pradesh | Dewas | Phase 4 | 13-May-24 |
Madhya Pradesh | Dhar | Phase 4 | 13-May-24 |
Madhya Pradesh | Indore | Phase 4 | 13-May-24 |
Madhya Pradesh | Khandwa | Phase 4 | 13-May-24 |
Madhya Pradesh | Khargone | Phase 4 | 13-May-24 |
Madhya Pradesh | Mandsour | Phase 4 | 13-May-24 |
Madhya Pradesh | Ratlam | Phase 4 | 13-May-24 |
Madhya Pradesh | Ujjain | Phase 4 | 13-May-24 |
Maharashtra | Ahmednagar | Phase 4 | 13-May-24 |
Maharashtra | Aurangabad | Phase 4 | 13-May-24 |
Maharashtra | Beed | Phase 4 | 13-May-24 |
Maharashtra | Jalgaon | Phase 4 | 13-May-24 |
Maharashtra | Jalna | Phase 4 | 13-May-24 |
Maharashtra | Maval | Phase 4 | 13-May-24 |
Maharashtra | Nandurbar | Phase 4 | 13-May-24 |
Maharashtra | Pune | Phase 4 | 13-May-24 |
Maharashtra | Raver | Phase 4 | 13-May-24 |
Maharashtra | Shirdi | Phase 4 | 13-May-24 |
Maharashtra | Shirur | Phase 4 | 13-May-24 |
Orissa | Berhampur | Phase 4 | 13-May-24 |
Orissa | Kalahandi | Phase 4 | 13-May-24 |
Orissa | Koraput | Phase 4 | 13-May-24 |
Orissa | Nabarangpur | Phase 4 | 13-May-24 |
Telangana | Adilabad | Phase 4 | 13-May-24 |
Telangana | Bhongir | Phase 4 | 13-May-24 |
Telangana | Chevella | Phase 4 | 13-May-24 |
Telangana | Hyderabad | Phase 4 | 13-May-24 |
Telangana | Karimnagar | Phase 4 | 13-May-24 |
Telangana | Khammam | Phase 4 | 13-May-24 |
Telangana | Mahabubabad | Phase 4 | 13-May-24 |
Telangana | Mahbubnagar | Phase 4 | 13-May-24 |
Telangana | Malkajgiri | Phase 4 | 13-May-24 |
Telangana | Medak | Phase 4 | 13-May-24 |
Telangana | Nagarkurnool | Phase 4 | 13-May-24 |
Telangana | Nalgonda | Phase 4 | 13-May-24 |
Telangana | Nizamabad | Phase 4 | 13-May-24 |
Telangana | Peddapalle | Phase 4 | 13-May-24 |
Telangana | Secunderabad | Phase 4 | 13-May-24 |
Telangana | Warangal | Phase 4 | 13-May-24 |
Telangana | Zahirabad | Phase 4 | 13-May-24 |
Uttar Pradesh | Akbarpur | Phase 4 | 13-May-24 |
Uttar Pradesh | Bahraich | Phase 4 | 13-May-24 |
Uttar Pradesh | Dhaurahra | Phase 4 | 13-May-24 |
Uttar Pradesh | Etawah | Phase 4 | 13-May-24 |
Uttar Pradesh | Farrukhabad | Phase 4 | 13-May-24 |
Uttar Pradesh | Hardoi | Phase 4 | 13-May-24 |
Uttar Pradesh | Kannauj | Phase 4 | 13-May-24 |
Uttar Pradesh | Kanpur | Phase 4 | 13-May-24 |
Uttar Pradesh | Kheri | Phase 4 | 13-May-24 |
Uttar Pradesh | Misrikh | Phase 4 | 13-May-24 |
Uttar Pradesh | Shahjahanpur | Phase 4 | 13-May-24 |
Uttar Pradesh | Sitapur | Phase 4 | 13-May-24 |
Uttar Pradesh | Unnao | Phase 4 | 13-May-24 |
West Bengal | Asansol | Phase 4 | 13-May-24 |
West Bengal | Baharampur | Phase 4 | 13-May-24 |
West Bengal | Bardhaman Durgapur | Phase 4 | 13-May-24 |
West Bengal | Bardhaman Purba | Phase 4 | 13-May-24 |
West Bengal | Birbhum | Phase 4 | 13-May-24 |
West Bengal | Bolpur | Phase 4 | 13-May-24 |
West Bengal | Krishnanagar | Phase 4 | 13-May-24 |
West Bengal | Ranaghat | Phase 4 | 13-May-24 |
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..