AI Devin: ఐటీ ఉద్యోగుల పాలిట డెవిల్‌లా మారిన డెవిన్‌..?

AI Devin: ఐటీ ఉద్యోగుల పాలిట డెవిల్‌లా మారిన డెవిన్‌..?

Anil kumar poka

|

Updated on: Mar 16, 2024 | 7:59 PM

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రంగంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఏఐ టెక్నాలజీతో భారీగా ఉద్యోగాల కోత తప్పదని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. అయితే ఏఐ రాకతో మరిన్ని ఉద్యోగాలు పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల కోత ఉండదని మరికొందరు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఏఐ రంగం డేటా సెర్చ్‌, ఫొటోలు డిజైనింగ్ వరకు మాత్రమే పరిమితమైంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రంగంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఏఐ టెక్నాలజీతో భారీగా ఉద్యోగాల కోత తప్పదని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. అయితే ఏఐ రాకతో మరిన్ని ఉద్యోగాలు పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల కోత ఉండదని మరికొందరు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఏఐ రంగం డేటా సెర్చ్‌, ఫొటోలు డిజైనింగ్ వరకు మాత్రమే పరిమితమైంది. అయితే రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ ఏకంగా వెబ్‌సైట్స్‌ను, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లను కూడా పూర్తిస్థాయిలో రాసేలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేస్తోంది. అమెరికాకు చెందిన కాగ్నిషన్‌ అనే స్టార్టప్‌ కంపెనీ ‘ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌’ను సృష్టించింది. దానికి ‘డెవిన్‌’ అని నామకరణం చేశారు. ఇది వెబ్‌సైట్లను, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లను రూపొందించిగలదని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే ఈ టెక్నాలజీ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఇంటర్వ్యూలను, వివిధ బెంచ్‌మార్క్‌ టెస్టులను విజయవంతంగా పాస్‌ అయిందని కంపెనీ తెలిపింది.

ఈ టెక్నాలజీతో సాఫ్ట్‌వేర్‌ కోడింగ్ రాయడం నుంచి మొదలు టెస్టింగ్, డీబగ్గింగ్‌ వరకు ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చేసే మొత్తం పనిని ఈ డెవిన్‌ చేసి పెట్టగలదని కాగ్నిషన్‌ కంపెనీ చెబుతోంది. చిన్న కమాండ్‌తోనే ఈ పనంతా చేసి పెడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా కోడింగ్ విషయంలో తాను చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే సామర్థ్యం కూడా ఈ టెక్నాలజీకి ఉందని కాగ్నిషన్‌ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ స్కాట్ తెలిపారు. అయితే ఈ డెవిన్‌ను పూర్తి స్థాయిలో ‘ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌’గా వినియోగించాలన్నది తమ ఉద్దేశం కాదని కెంపెనీ చెబుతోంది. ఏది ఏమైనా ఏఐ టెక్నాలజీతో భారీ ఎత్తున ఉద్యోగాలు పోతాయన్న వార్తలకు ఇది బలం చేకూర్చినట్లైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..