ఈ ఒక్క క్వాలిటీతో మీరు విజేత అవుతారు! మీలో ఉందా?
ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు చాలామందిలో ఒక ముఖ్యమైన గుణం లోపిస్తున్నట్లు కనిపిస్తోంది. అదే ఓర్పు లేదా సహనం (Patience). ఉరుకుల పరుగుల జీవనశైలిలో ప్రతి విషయాన్ని వెంటనే పూర్తి చేయాలనే ఆతృత పెరిగిపోయింది. ఏ విషయంలోనూ ఎదురుచూడడానికి ఓపిక లేకుండా పోతోంది. అయితే, ఈ విధమైన ఆతురత అన్ని సందర్భాల్లో మంచిది కాదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరిలోనూ ఒక ప్రధాన అంశం లోపిస్తోంది. అదే ఓర్పు లేదా సహనం(Patience). ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికీ ఓపిక లేకుండా పోతోంది. ప్రతీది అత్యవసరంగానే మారిపోయింది. ఏ విషయంలోనూ చాలా మందికి ఓపిక లేకుండా పోతోంది. ప్రతీది త్వరగా అయిపోవాలి. అయితే, ఇది అన్ని విషయాల్లోనూ మంచిది కాదంటున్నారు మానసిక నిపుణులు.
చాలా విషయాల్లో తొందరపడి మనం గొప్పగా సాధించేది ఏమీ ఉండదని అంటున్నారు. తొందరపాటు వల్ల దీర్ఘకాలికంగా నష్టాలను కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నిత్యావసర వస్తువుల కోసం తొందరపడటం ఆమోద యోగ్యమే అయినప్పటికీ.. అవసరం లేని వాటి కోసం కూడా ఎందుకు పడాలో ఆలోచించడం లేదు.
ఆ లక్షణం లేకుంటే నష్టాలే
అతి తొందరపాటు వల్ల కొన్ని సాధారణ పనులు కూడా సరిగ్గా జరగవు. దీంతో అవి సరి చేయడానికి మరింత సమయం పట్టవచ్చు. ఇలాంటివి పలు కార్యాలయాల్లో జరుగుతూనే ఉంటాయి. అందువల్ల తొందరపాటు అనేది ఏదో ఒక విధంగా నష్టమే కలిగిస్తుంది. ఏ పని చేసినా హుడావుడిగా కాకుండా ప్రశాంతంగా తగినంత వేగంగా చేస్తే సరిపోతుంది.
నిజానికి పరిణామాలు తెలుసుకోకుండా తీసుకునే తొందరపాటు నిర్ణయాలు జీవితంలో అనేక కష్టాలను కలగచేయవచ్చు. దీని ప్రభావం మీ జీవితం, ఆర్థిక పరిస్థితులపై తీవ్రంగా ఉండవచ్చు. తొందరపాటు మాటలు సంబంధాలను, మంచి స్నేహాలను కోల్పోవడానికి దారితీస్తాయి. అందుకే తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు.
ఉదాహరణకు రహదారులపై వాహనదారులు అమితమైన వేగంతో వెళుతుంటారు. రెడ్ సిగ్నల్ పడినప్పటికీ.. ఆగకుండా వెళుతుంటారు. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు ఢీని ప్రమాదాల బారినపడుతుంటారు. అది వారితోపాటు ఇతరులకు కూడా ప్రమాదమే. సిగ్నల్ పడితే ఒక నిమిషంపాటు కూడా వేచి చూసే అలవాటు నేటి యువతలో లేకుండా పోతోంది. ఏ పనిలోనైనా వేగంగా ఉండాలి కానీ, జాగ్రత్త కూడా తీసుకోవాలి.
విజేత అవుతారు
ఏ విషయంపైనా తెలిసిన వెంటనే కాకుండా.. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలి. ఆ తర్వాతనే స్పందించాలి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా జీవించడం నేర్చుకోవాలి. ఓర్పును అలవర్చుకుంటే జీవితం ప్రశాంతంగా మారుతుంది. సంతోషకరమైన జీవితానికి బాటలు వేస్తుంది. ఒక రోజులో ఇంటి నిర్మాణం పూర్తి కాదు. అలాగే జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే సుదీర్ఘ శ్రమ, ప్రణాళికలు అవసరం అవుతాయి. వీటితోపాటు ఓర్పు కూడా ఎంతో అవసరం. ఎందుకంటే ఏదైనా ప్రారంభించిన వెంటనే సానుకూల ఫలితాల రాకపోవచ్చు.. ఓర్పుతో తమ పనిని సజావుగా కొనసాగిస్తుంటే.. మాత్రం ఒక రోజు విజయ తీరాలకు తప్పక చేరుకుంటారు. అనుకున్నది సాధిస్తారు.
