చలికాలంలో చర్మం మెరిసిపోవాలంటే..ఈ సింపూల్ టిప్స్ ట్రై చేయండి..రెట్టింపు అందం మీ సొంతం..!
చలికాలంలో చర్మం నిర్జీవంగా, పొడిగా మారుతుంది. చర్మం నిర్జీవంగా మారకుండా ఉండటానికి చర్మ సంరక్షణ అవసరం. చలికాలంలో మందపాటి మాయిశ్చరైజర్ వాడాలి. స్నానం తర్వాత చర్మానికి బాడీ ఆయిల్స్ కూడా అప్లై చేయవచ్చు. దీనివల్ల తేమ లాక్ అవుతుంది. సీరమ్స్ కూడా చర్మాన్ని హైడ్రేటెడ్గా చేస్తాయి. అలాగే హైడ్రేషన్ కూడా ముఖ్యం కాబట్టి నీరు ఎక్కువ తాగాలి.

శీతాకాలం వచ్చిందంటే.. చర్మ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. చల్లటి గాలుల కారణంగా చర్మం పొడిబారిపోయి చిరాకు కలిగిస్తుంది. నల్లటి మచ్చలు, దురద చికాకు కలిగిస్తుంది. ముఖం పొడిగా, సాగదీసినట్టుగా, నిర్జీవంగా మారుతుంది. కొన్నిసార్లు పగిలిపోయి ఉన్నట్లు అనిపిస్తుంది. సాధారణ వాతావరణంలో తేలికపాటి క్రీమ్ సరిపోతుంది. శీతాకాలంలో చర్మానికి కొంచెం అదనపు జాగ్రత్త అవసరం. ముఖ్యంగా రాత్రి సమయం చర్మ మరమ్మతుకు మంచి సమయం. ఎందుకంటే, ఈ సమయంలో చర్మం సహజంగానే నయం అవుతుంది. పునరుత్పత్తి ప్రారంభమవుతుంది. కాబట్టి, మీరు రాత్రిపూట మీ ముఖంపై సరైనదాన్ని జాగ్రత్తలు, కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. ఉదయానికల్లా మీ చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. అదేలాగో ఇక్కడ చూద్దాం..
శీతాకాలంలో పొడి చర్మం, దురద, నల్ల మచ్చలు వేధిస్తాయి. రాత్రిపూట సరైన చర్మ సంరక్షణతో ఈ సమస్యలను నివారించవచ్చు. షియా బటర్, బాదం లేదా ఆముదం వంటి మందపాటి మాయిశ్చరైజర్‌లు, సహజ నూనెలను ఉపయోగించడం ద్వారా చర్మానికి తేమను అందించి, మృదువుగా, ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాలతో ఉదయం లేవగానే ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందండి.
శీతాకాలంలో విప్డ్ లేదా జెల్ క్రీములు తక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటికి బదులుగా షియా బటర్, కోకో బటర్, బాదం నూనె లేదా ఆలివ్ నూనె వంటి పదార్థాలను కలిగి ఉన్న మందపాటి మాయిశ్చరైజర్‌ను ఎంచుకోండి. ఇవి చర్మంపై రక్షణ పొరను ఏర్పరుస్తాయి. తేమను లాక్ చేస్తాయి. విటమిన్ E సమృద్ధిగా ఉండే కుసుమ నూనె వాడకం మంచిది. ఇది చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది, సున్నితమైన చర్మానికి చాలా మంచిది.
అలాగే, ఆముదం కూడా. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పొడిబారకుండా కాపాడుతుంది. చలికాలంలో చర్మ సమస్యలను తగ్గిస్తుంది. చర్మాన్ని డీటాక్స్ చేస్తుంది. శరీరానికి వేడిని అందించి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ఇది అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది, పొడిబారకుండా కాపాడుతుంది.
ఆవా నూనె కూడా చర్మ సంరక్షణలో అద్భుత ఫలితానిస్తుంది. చర్మంలో సహజంగా ఉండే నూనెను పోలి ఉంటుంది, తేమను నిలుపుకుని, జిడ్డును నియంత్రిస్తుంది. లేదంటే, బాదం నూనె, కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను శరీరానికి మసాజ్ చేసి కొద్దిసేపటి తర్వాత స్నానం చేయండి. ఇది చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది.. చర్మాన్ని కొద్దిగా తడిగా ఉన్నప్పుడు నూనెను అప్లై చేయండి. ఇది తేమను బాగా పట్టి ఉంచుతుంది. క్రమంతప్పకుండా చేస్తూ ఉంటే.. మీ చర్మం బొద్దుగా, మృదువుగా, ప్రకాశవంతంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




