Health Care: బ్రేక్ ఫాస్ట్ గా వీటిని ఎక్కువగా తింటున్నారా.. అస్సలు తీసుకోకూడదు!
ప్రతి ఒక్కరి జీవితంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనేది కామన్ విషయం. ఎందుకంటే రాత్రి 8 లేదా 9 గంటల సమయంలో ఆహారం తీసుకుంటారు. ఆ తర్వాత నుంచి ఏమీ తీసుకోరు. కాబట్టి బాడీ డీ హైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఉదయాన్నే మంచి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే కొంత మంది లేవగానే ఏది పడితే అది తినడం.. తాగడం చేస్తూ ఉంటారు. దీని వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కొంత మంది చాలా వరకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తూ..
ప్రతి ఒక్కరి జీవితంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనేది కామన్ విషయం. ఎందుకంటే రాత్రి 8 లేదా 9 గంటల సమయంలో ఆహారం తీసుకుంటారు. ఆ తర్వాత నుంచి ఏమీ తీసుకోరు. కాబట్టి బాడీ డీ హైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఉదయాన్నే మంచి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే కొంత మంది లేవగానే ఏది పడితే అది తినడం.. తాగడం చేస్తూ ఉంటారు. దీని వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మరి కొంత మంది చాలా వరకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఇలా లేని అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా అస్సలు తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఉదయం అల్పాహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటివి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉండాలి:
చాలా మంది ఉదయం స్పైసీ ఉన్న ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతారు. ఇలా అస్సలు తినకూడదట. దీని వల్ల ప్రేగులు లూజ్ అవుతాయి. జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, కడుపులో నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతే కాకుండా స్పైసీ ఫుడ్ లో పోషకాలు కూడా నిల్ ఉంటాయి.
బ్రెడ్ – జామ్:
చాలా మంది ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ అండ్ జామ్ ని తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది చాలా ఈజీగా, ఫాస్ట్ గా అయ్యే బ్రేక్ ఫాస్ట్. కాబట్టి దీన్ని తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఉదయాన్న బ్రెడ్, జామ్ ని తీసుకోవడం వల్ల మెదడు పని తీరు అనేది తగ్గుతుందట. ఏ పని మీద కూడా సరైన విధంగా ఏకాగ్రత కూడా పెట్టలేరు. అంతే కాకుండా డిప్రెషన్, మానసికంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందట. కాబట్టి వీలైనంత వరకూ దీనికి దూరంగా ఉండటమే బెటర్.
ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ లు:
మార్నింగ్ జ్యూసులు తీసుకోవడం అలవాటు. ఇది చాలా మంచిదే. కానీ పండ్లతో కాకుండా మార్కెట్ లో లభించే ప్యాకేజ్డ్ జ్యూస్ లు తాగితే మాత్రం అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఎందుకంటే అవి నిల్వ ఉండటానికి రసాయనాలు కలుపుతారు. మార్నింగ్ వాటిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి.
సిట్రస్ ఫ్రూట్స్:
సిట్రస్ ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక స్థాయిలు అనేవి పెరుగుతాయి. కానీ ఉదయాన్నే పండ్లు కానీ జ్యూస్లు తాగితే అల్సర్, గుండెల్లో మంటలు, గ్యాస్, ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.