Natural mosquito repellents: ఈ నాలుగు మొక్కలు ఇంట్లో ఉంటే.. ఒక్క దోమని కూడా ఇంట్లోకి రానివ్వవు!

శీతా కాలం అంటేనే జబ్బుల కాలం అని అనవచ్చు. శీతా కాలంలో ఎండ వేడి అనేది చాలా తక్కువ సమయం ఉంటుంది. గాలిలో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉదయం 9 అయితే కానీ సూర్యుడు కనబడడు. అలాగే సాయంత్రం 4 అవ్వగానే మాయం అయిపోతాడు. ఇక శీతా కాలంలో దోమల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి డేంజర్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దోమల పట్ల అలసత్వం వహిస్తే మాత్రం ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది. దోమలు రావడానికి అనేక కారణాలు కూడా ఉణ్నాయి. చెమట, వదిలే వాయువును కూడా..

Natural mosquito repellents: ఈ నాలుగు మొక్కలు ఇంట్లో ఉంటే.. ఒక్క దోమని కూడా ఇంట్లోకి రానివ్వవు!
Mosquitoes Effects
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 22, 2023 | 10:45 PM

శీతా కాలం అంటేనే జబ్బుల కాలం అని అనవచ్చు. శీతా కాలంలో ఎండ వేడి అనేది చాలా తక్కువ సమయం ఉంటుంది. గాలిలో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉదయం 9 అయితే కానీ సూర్యుడు కనబడడు. అలాగే సాయంత్రం 4 అవ్వగానే మాయం అయిపోతాడు. ఇక శీతా కాలంలో దోమల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి డేంజర్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దోమల పట్ల అలసత్వం వహిస్తే మాత్రం ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది.

దోమలు రావడానికి అనేక కారణాలు కూడా ఉణ్నాయి. చెమట, వదిలే వాయువును కూడా పసిగట్టి 100 అడుగుల దూరంలో ఉన్నా కూడా వచ్చేస్తాయి దోమలు. ఈ దోమల్ని తరిమేయడానికి మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులు ఉన్నాయి. కానీ అవి రసాయనాలతో తయారై ఉంటాయి. వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ. మరి సహజ సిద్ధంగా దోమల్ని తరిమి కొట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బంతి పూల మొక్కలు:

ఇవి కూడా చదవండి

ఏడాది పొడవునా బంతి మొక్కలు అనేవి పూస్తూ ఉంటాయి. బంతి పూల వాసన అంటే దోమలకు నచ్చవు. ఇంటి బయట కానీ, ఇంట్లో కానీ బంతి పూల మొక్కను ఉంచితే దొమల్ని తరిమికొడుతుంది. బంది పూల మొక్కల నుంచి పైరేత్రమ్, సపోనిన్ అనే సమ్మేళనాలు రిలీజ్ అవుతాయి. ఇవి దోమల్ని దూరంగా ఉంచుతాయి.

రోజ్మేరీ మొక్క:

రోజ్మేరీ మొక్క పూల వాసన అన్నా కూడా దోమలకు పడవు. ఈ మొక్క కాండం వాసనకు దోమలు దూరంగా పారి పోతాయి. ఈ మొక్క తెలుపు, నీలం వంటి పువ్వులను కలిగి ఉంటుంది. ఈ మొక్క నుంచి నూనె కూడా తీసి అమ్ముతూంటారు. దీన్ని శరీరంపై రాసుకున్నా దోమలు కుట్టవు.

లావెండర్ మొక్క:

లావెండర్ మొక్క నుంచి కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. దీని పూలు కూడా అందంగా ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా లావెండర్ మొక్క ఆయిల్ ని వివిధ అనారోగ్య సమస్యల్ని నివారించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్కను ఇంట్లో పెంచు కోవడం వల్ల దోమలు, చీమలు, ఈగలు, సాలె పురుగులు దూరంగా వెళ్లి పోతాయి. అంతే కాకుండా వివిధ రకాల చర్మ సమస్యల్ని కూడా చెక్ పెట్టవచ్చు.

తులసి మొక్క:

తులసి మొక్కతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. తులసి మొక్క ఉన్న చోట.. దోమలు రాకుండా చూస్తుంది. తులసి ఆకుల రసాన్ని ఒంటికి రాసినా.. ఇంట్లో స్ప్రే చేసినా కూడా దోమలు రాకుండా ఉంటాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!