Winter Tips: చన్నీటి స్నానం లేదా వేడి నీటి స్నానం.. శీతాకాలంలో ఏది మంచిది? ఆయుర్వేదంలో ఏం చెప్పారు..!

అన్ని కాలాలు వేరు.. శీతా కాలం వేరు. ఎండా కాలం, వర్షా కాలంలో ఎలా ఉన్నా కానీ.. శీతా కాలంలో మాత్రం చర్మం పరంగా, ఆరోగ్యం పరంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సాధారణంగా కొంత మంది చన్నీటితో స్నానం చేస్తారు. మరి కొంత మంది వేడి నీటితో చేస్తారు. స్నానం చేస్తే మంచి రిలాక్సేషన్ దొరకుతుంది. చిరాకు పోయి.. మనసుకి హాయిగా ఉంటుంది. అయితే చన్నీటి స్నానం మంచిదా? వేడి నీటి స్నానం చేయడం మంచిదా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. మరి ఏ స్నానం వల్ల లాభాలు..

Winter Tips: చన్నీటి స్నానం లేదా వేడి నీటి స్నానం.. శీతాకాలంలో ఏది మంచిది? ఆయుర్వేదంలో ఏం చెప్పారు..!
Shower
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 21, 2023 | 7:11 PM

అన్ని కాలాలు వేరు.. శీతా కాలం వేరు. ఎండా కాలం, వర్షా కాలంలో ఎలా ఉన్నా కానీ.. శీతా కాలంలో మాత్రం చర్మం పరంగా, ఆరోగ్యం పరంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సాధారణంగా కొంత మంది చన్నీటితో స్నానం చేస్తారు. మరి కొంత మంది వేడి నీటితో చేస్తారు. స్నానం చేస్తే మంచి రిలాక్సేషన్ దొరకుతుంది. చిరాకు పోయి.. మనసుకి హాయిగా ఉంటుంది. అయితే చన్నీటి స్నానం మంచిదా? వేడి నీటి స్నానం చేయడం మంచిదా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. మరి ఏ స్నానం వల్ల లాభాలు ఉన్నాయి? లేక నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. శీతా కాలంలో చన్నీటి స్నానం చేస్తే..: శీతా కాలంలో చన్నీటితో స్నానం చేయడం వల్ల బాడీలో వాతవ అనేది పెరుగుతుంది. దీని వల్ల నొప్పులు, కండరాల నొప్పులు, చర్మం పొడి బారడం, బలహీనమైన జీవక్రియ వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతే కాకుండా శరీరం నొప్పులు తీరవు. కానీ ఒకవేళ క్రమం తప్పకుండా చన్నీటితో స్నానం చేసే వారైతే మాత్రం.. శీతా కాలంలో కూడా చన్నీటి స్నానం చేయడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరంలో ఎలాంటి భంగం కలిగించదు. అంతే కాకుండా చన్నీటి స్నానం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతంది. తెల్ల రక్తకణాలు అధిక శాతం, జీవ క్రియ రేటు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
  2. శీతా కాలంలో వేడి నీటి స్నానం చేస్తే..: వింటర్ సీజన్ లో వేడి నీటితో స్నానం శరీర వాతాన్ని తగ్గిస్తుంది. అలాగే కండరాల నొప్పులు, ఒత్తిడి తగ్గుతుంది. మనసుకు, శరీరానికి ప్రశాంతంగా ఉంటుంది. అంతే కాకుండా వేడి నీళ్లు చేసేటప్పుడు వచ్చే పొగను పీల్చడం ద్వారా జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చలి తీవ్రతను కూడా తగ్గిస్తుంది.
  3. ఆయుర్వేదం ప్రకారం ఏ నీటితో చేస్తే మంచిది: ఆయుర్వేదం ప్రకారం చన్నీటి స్నానం చేయడం వల్ల వాతాన్ని పెంచడమే కాకుండా చలి కూడా పెరుగుతుంది. కాబట్టి శరీరం వేడిని కాపాడుకోవడానికి చాలా కష్ట పడాలి. చలి కాలంలో బాహ్య ప్రపంచం చల్లగా ఉంటుంది. శరీరం అంతర్గత వాతావరణాన్ని వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మీరు శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. వేడి నీటి స్నానంతో చలి కారణంగా వణుకు తగ్గడమే కాకుండా ఒత్తిడి, కండరాల నొప్పులు, సీజనల్ గా వచ్చే వ్యాధులనూ దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

ఇవి కూడా చదవండి
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?