Kingdom : విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విజయ్ సినిమా.. 24గంటలు గడవకముందే..
పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ ‘టాక్సీవాలా’ ‘గీతా గోవిందం’ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా నిలిచాడు విజయ్ దేవరకొండ. అయితే అతనికి ఇటీవల వరస పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ‘జెర్సీ’ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ‘కింగ్‌డమ్’ సినిమా చేశాడు.

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్ డమ్ సినిమా కోసం ప్రేక్షుకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ఫ్యామిలీ మ్యాన్ సినిమా తర్వాత విజయ్ చిన్న గ్యాప్ తీసుకొని ఇప్పుడు కింగ్ డమ్ సినిమాతో రాబోతున్నాడు. మళ్ళీ రావా, జెర్సీ మూవీ లాంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండటంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాను కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు గౌతమ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..
నేడు తిరుపతిలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదలకు ముందే నయా రికార్డ్ క్రియేట్ చేసింది. కింగ్ డమ్ సినిమా ప్రీమియర్స్ ఈ నెల 30న జరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అవ్వగా 24గంటలు గడవక ముందే భారీగా అమ్ముడయ్యాయి.
ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
కింగ్ డమ్ సినిమా యుఎస్ ప్రీమియర్స్ ఈ నెల 30న జరగనున్నాయి. ఈ ప్రీమియర్స్ కోసం బుకింగ్స్ ఓపెన్ చేశారు. బుకింగ్స్ మొదలై 24గంటలు కూడా అవ్వక ముందు పది వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని చిత్రయూనిట్ స్వయంగా తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక కింగ్ డమ్ సినిమా జూలై 31న వరల్డ్‌వైడ్ ప్యాన్‌ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది ఈ చిత్రం. హిందీలో ‘సామ్రాజ్య’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సెన్సార్ బోర్డు ఈ సినిమా కు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇప్పటికే సినిమా చూసిన సెన్సారుబోర్డు మెంబర్స్ సినిమా అదిరిపోయిందని అంటున్నారు.
ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!
#Kingdom is coming for TOTAL DOMINATION 🔥
UK is already setting the box office on fire with 10,000+ Premiere tickets sold in under 24 hours 💥💥#KingdomOnJuly31st https://t.co/BuVAG79kxn
— Sithara Entertainments (@SitharaEnts) July 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








