- Telugu News Photo Gallery Cinema photos Don't miss this suspense crime thriller movie that is trending on OTT
ఇదెక్కడి సినిమా రా మావ..! IMDbలో 8 రేటింగ్ దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
ఓటీటీలో ప్రతి శుక్రవారం రకరకాల సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుం ఉంటాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ప్రతి శుక్రవారం ఓటీటీల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల జోనర్స్ సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు ఏమాత్రం ఖాళీ దొరికినా కూడా ఓటీటీలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు
Updated on: Jul 24, 2025 | 11:29 PM

ఓటీటీలో ప్రతి శుక్రవారం రకరకాల సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుం ఉంటాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ప్రతి శుక్రవారం ఓటీటీల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల జోనర్స్ సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు ఏమాత్రం ఖాళీ దొరికినా కూడా ఓటీటీలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు

థియేటర్స్ లో విడుదలైన సినిమాలను ఓటీటీలో మళ్లీ మళ్లీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇతర బాషల సినిమాలను కూడా ఓటీటీలో చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సినీ లవర్ ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో థ్రిల్లర్ సినిమాలు ముందు వరసలో ఉంటాయి. ఇప్పటికే ఎన్నో రకాల థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.

ఇప్పుడు ఓ థ్రిల్లర్ మూవీ ఓటీటీని ఊపేస్తోంది. ఈ థ్రిల్లర్ పేరు అభయ్. హిందీలో తెరకెక్కిన ఈ సిరీర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ క్రైమ్-థ్రిల్లర్ సిరీస్ చాలా డార్క్, డిస్టర్బింగ్‌గా ఉంటుంది. కానీ ఈ సిరీస్ మొదలు పెడితే ఆపడం కష్టం.

ప్రతి ఎపిసోడ్ మిమ్మల్ని ఓ డార్క్ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఈ సినిమాలో సీన్స్ ఆమ్మో సీట్ ఎడ్జ్ పై కూర్చోబెడుతుంది. ఊహించని ట్విస్ట్ లు, బుర్ర తిరిగే సీన్స్.. ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ అస్సలు మిస్ అవ్వకండి. థ్రిల్లర్ మూవీ చూసే ఆడియన్స్ ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తారు.

ఈ సిరీస్ మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ప్రతి సీజన్ లో ప్రతి ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్ లు ఉంటాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. IMDbలో 8 రేటింగ్ పొందిన ‘అభయ్’ మూడు సీజన్లు దూసుకుపోతున్నాయి.