- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress Who Shared Workout Photos at Gym, Her Name Is Ramya Pasupileti
Tollywood : జిమ్లో అందాల ముద్దుగుమ్మ.. ఫిట్నెస్తో గత్తరలేపుతోన్న వయ్యారి.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇప్పుడిప్పుడే చిన్న చిన్న సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తాజాగా జిమ్ లో వర్కవుట్స్ మూడ్ లో తీసుకున్న స్టైలిష్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది అందం కాదు శక్తి అంటూ ఆమె క్యాప్షన్ పెట్టడంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?
Updated on: Jul 25, 2025 | 7:40 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు చిన్న చిన్న సినిమాలలో కథానాయికగా కనిపిస్తూ అందం, అభినయంతో కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అటు ట్రెడిషనల్.. ఇటు గ్లామర్ ఫోజులతో కవ్విస్తోన్న ఈ బ్యూటీకి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇంతకీ ఈ అందాల సుందరి ఎవరో గుర్తుపట్టగలరా..?

ఇటీవల వర్కవుట్ మూడ్ లో తీసుకున్న స్టైలీష్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది అందం కాదు.. శక్తి అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఇప్పుడు ఆమె ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. మరోవైపు యూత్ సైతం అమ్మడు క్రేజీ ఫోటోలకు రెస్పాన్స్ ఇస్తున్నారు.

స్పోర్ట్స్ డ్రెస్ లో అద్దం ముందు నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్న ఈ అమ్మడు మరెవరో కాదండి.. హీరోయిన్ రమ్య పసుపులేటి. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తన లుక్, స్టైల్ తో ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. జిమ్ లో కష్టపడుతున్న ఫోటోస్ షేర్ చేయడంతో ఆమెలో వచ్చిన మార్పు చూసి షాకవుతున్నాయి.

కమిట్మెంట్ సినిమాతో కథానాయికగా పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత రామ్ లీలా, గామీ, హుషారు వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎక్కువగా గ్లామర్ పాత్రలకే ఎక్కువగా చేయగా.. యాక్టింగ్ టాలెంట్ కు కూడా అవకాశం లభించింది. పెద్దగా హిట్స్ రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం భారీగా ఫాలోయింగ్ పెంచుకుంది.

ఇటీవల ఓ వెబ్ సిరీస్ పూర్తి చేసినట్లు సమాచారం. అలాగే ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గ్లామర్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది ఈ అమ్మడు. రమ్య పసుపులేటి.. తెలుగులో మైల్స్ ఆఫ్ లవ్, ఫస్ట్ ర్యాంక్ రాజు, బీఎఫ్ఎఫ్ వంటి వెబ్ సిరీస్ చేసింది.




