AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తారక్ మనసు బంగారం..! ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నాడు.. కళ్లల్లో నీళ్లు తిరిగాయి: సీనియర్ నటి

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే.. థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. ఫ్యాన్స్ పూనకాలతో ఉగిపోతుంటారు. ఇక ఎన్టీఆర్ డాన్స్ కు , నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు.

తారక్ మనసు బంగారం..! ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నాడు.. కళ్లల్లో నీళ్లు తిరిగాయి: సీనియర్ నటి
Ntr
Rajeev Rayala
|

Updated on: Jul 25, 2025 | 5:12 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాన్స్ తో నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు తారక్. ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారక్. తనదైన నటనతో డాన్స్ లతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అలాగే దేవర సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు వార్ 2తో రానున్నాడు. ఎన్టీఆర్ ను కళ్ళతోనే హావభావాలను పలికించగల నటుడు అని కొనియాడుతుంటారు దర్శకులు. ఇక ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎన్టీఆర్ ఎప్పుడు నేను బడా హీరోను అని డాబులు పోలేదు. ఎంత స్టార్ హీరో అయినా చాలా డౌన్ టు ఎర్త్ గా ఉంటాడు. అభిమానులతోనైనా తోటి నటులతో నైనా చాలా స్నేహభావంతో ఉంటాడు. అలాంటి తారక్ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాళ్ళు పట్టుకున్నాడట.

ఇది కూడా చదవండి : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధా అందరికి పరిచయం ఉండే ఉంటారు. ఎన్నో వందలాది సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు అమ్మ , వదిన పాత్రల్లో ఎంతో చక్కగా నటించి మెప్పించారు సుధా. అయితే ఆమె తారక్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి : ఎలాంటి అమ్మాయి ఎలా మార్చేశారా..! నటనతో పిచ్చెక్కించిన ఈ భామ ఎవరో తెలుసా..?

ఎన్టీఆర్ తో నటించేటప్పుడు జరిగిన ఓ ఇన్సిడెట్ ను ఆమె గుర్తు చేసుకున్నారు. బాద్షా సినిమా చేస్తున్న సమయంలో ఆడవాళ్ళతో కలిసి ఎన్టీఆర్ డాన్స్ చేసే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో సుధాతో కలిసి డాన్స్ చేశారు. అయితే ఆ సమయంలో ఆమె కాలు స్లిప్ అయ్యిందట. దాంతో వెంటనే ఆమె కాలు పట్టుకొని.. ఏం కాదు అమ్మ అంటూ.. స్ప్రే తెప్పించి కాలుకు స్ప్రే చేశారట. అంత పెద్ద హీరో అయ్యుండి తన కాలు పట్టుకొని అమ్మ అంటూ ఎంతో బాగా చూసుకున్నారట. ఈ విషయం చెప్తూ ఆమె ఎన్టీఆర్ ఎంతో మంచివాడు అంటూ మురిసిపోయారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. రెండు సార్లు విడాకులు.. చివరకు ఇప్పుడు ఇలా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us