AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోయిన్స్ వల్లే కాలేదు..! ఏకంగా ఓ దీవినే కొనేసింది.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

హీరోయిన్స్ చాలా మంది హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్న వారు ఉన్నారు. ఇప్పుడు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక హీరోయిన్స్ కొంతమంది కాస్ట్లీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఖరీదైన కారులు, బ్రాండెడ్ బట్టలు.. అంటూ తెగ హడావిడి హడావిడి చేస్తుంటారు.

స్టార్ హీరోయిన్స్ వల్లే కాలేదు..! ఏకంగా ఓ దీవినే కొనేసింది.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 23, 2025 | 7:57 PM

Share

చాలా మంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. తమ నటనతో స్టార్ హీరోయిన్స్ గా రాణించడమే కాదు కోట్లల్లో రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. కేవలం సినిమాలతోనే కాదు ఇతర బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ కార్లు, భారీదైన ప్లాట్స్, ఇలా చాలానే కొంటుంటారు. అయితే ఓ అందాలా భామ మాత్రం ఏకంగా ఓ దీవినే కొనుగోలు చేసింది. ఆమె ఎవరో తెలుసా.? స్టార్ హీరోయిన్ కూడా కాదు. చేసిన సినిమాలకు కూడా తక్కువే.. అయినా కూడా కోట్లకు అధిపతి ఆ అమ్మడు. ఎవరో కనిపెట్టారా.?

ఇది కూడా చదవండి : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్

బాలీవుడ్ తారలు కీర్తి, డబ్బు అలాగే  లగ్జరీ లైఫ్ ఇవి లేకుంటే ఉండలేరు. చాలా మంది వీటికోసమే కష్టపడుతూ ఉంటారు. కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌లు, విలాసవంతమైన జీవనం, ఫ్యాషన్ ప్రతి ఒక్క హీరోయిన్ కోరుకుంటుంది. ప్రకటనలు, బిజినెస్‌లు, సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్స్ అదే రేంజ్‌లో కోట్లు ఖర్చు చేయడం కొత్త కాదు. ఇలా సంపాదించిన డబ్బును ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఖర్చు చేస్తారు. చాలా మంది ఇప్పటికే భారతదేశంలో, విదేశాలలో లగ్జరీ కార్లు, బంగ్లాలను కొన్నారు. ఇప్పుడు ఓ బాలీవుడ్ నటి ఏకంగా శ్రీలంకలో ఓ దీవిని సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఎలాంటి అమ్మాయి ఎలా మార్చేశారా..! నటనతో పిచ్చెక్కించిన ఈ భామ ఎవరో తెలుసా..?

అయితే దీపికా పదుకొనే, ఐశ్వర్యారాయ్, కత్రినా, ఆలియా బట్‌లుఅనుకుంటారేమో ఆమె కాదు. హాలీవుడ్‌లో తన ఉనికిని చాటుకున్న ప్రియాంక చోప్రా కూడా కాదు. ఆమె ఎవరో కాదు శ్రీలంకలో జన్మించిన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ ముద్దుగుమ్మ ఓ దీవిని సొంతం చేసుకుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తండ్రి శ్రీలంక, తల్లి మలేషియా చెందిన వారు. 2012లో, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకలో రూ. 3.5 కోట్ల విలువైన ప్రైవేట్ ఐలాండ్‌ను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ నాలుగు ఎకరాల ద్వీపం శ్రీలంక దక్షిణ తీరంలో ఉంది. శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు చెందిన ప్రైవేట్ ద్వీపానికి సమీపంలో ఉంది. ఇక్కడ విల్లా నిర్మించాలనేది జాక్వెలిన్ కల అని తెలుస్తోంది. ముంబైలో జాక్వెలిన్‌కు 5 బిహెచ్‌కె అపార్ట్‌మెంట్ కూడా ఉందని టాక్. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2009లో అల్లాదీన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది, హౌస్‌ఫుల్, మర్డర్ 2, కిక్ , రేస్ 2తో సహా 30కి పైగా చిత్రాలలో నటించింది.

ఇది కూడా చదవండి :18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. రెండు సార్లు విడాకులు.. చివరకు ఇప్పుడు ఇలా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం