బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్
సినీ సెలబ్రెటీల గురించి నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. హీరోయిన్స్ గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అందులోనూ బాలీవుడ్ భామల గురించి మరీ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. సినిమాల కంటే చాలా మంది భామలు వ్యక్తిగత విషయాలతో వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు.

సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. వెండితెరపై తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటారు చాలా మంది నటీనటులు. ఒక్క సినిమా హిట్ అయితే ఆ యాక్టర్స్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఊహించని ఫాలోయింగ్, స్టార్ డమ్ అందుకుంటారు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. నటీనటులుగా తమకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్న తారలు.. పర్సనల్ లైఫ్ లో మాత్రం నిత్యం ఏదోక సమస్యతో పోరాడుతూనే ఉంటారు. కొంతమంది ఫిట్ నెస్ కోసం, అందం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అందానికి మెరుగులు దిద్దుకోవడానికి సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఆ సర్జరీలు బెడిసికొడుతుంటాయి. పైన కనిపిస్తున్న అందాల భామను గుర్తుపట్టారా.? ఆమె ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. ఆమె గురించి తెలియని వారు ఉండరు.
ఇది కూడా చదవండి : స్టార్ హీరో సినిమాలో గెస్ట్‌రోల్‌లో ప్రభాస్.. కన్నప్ప కంటే ముందే చేశాడు.. ఆ మూవీ ఎదో తెలుసా..?
ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ నిత్యం ఎదో రకంగా వార్తల్లో ఉంటుంది. ముఖ్యంగా విచిత్రమైన వేషధారణతో ఎప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంది ఈ అమ్మడు. రకరకాల వస్తువులతో డ్రస్సులు డిజైన్ చేసుకుంటూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది ఈ చిన్నది. ఉర్ఫీ జావేద్ ఎలాంటి దుస్తులు దరిస్తుందో ఊహించడం ఎవరి తరంకాదు. చేతికి దొరికిన వస్తువులను ఆమె దుస్తులుగా మార్చుకొని ధరిస్తూ ఉంటుంది. అంతే కాదు తరచూ ఆమె దుస్తులపై విమర్శలు ఎదుర్కొంటుంది.
ఇది కూడా చదవండి: అప్పుడు యావరేజ్ అన్నారు.. ఇప్పుడు పిచ్చెక్కిపోతున్నారు..! ఓ సినిమా కోసం ఏకంగా అలా కనిపించింది ఈ అమ్మడు
బాలీవుడ్ లో ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. ఈ అమ్మడు టీవీ నటిగా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. గతంలో ఉర్ఫి జావేద్ లిప్ ఫిల్లర్స్ ను ట్రై చేసింది. కానీ అది బెడిసికొట్టడంతో పెదవులు దారుణంగా మారిపోయాయి. దాదాపు 9ఏళ్ల క్రితం ఉర్ఫి జావేద్ లిప్ ఫిల్లర్స్ ట్రై చేసింది. ఇన్నాళ్లకు ఆ పెదవులు నార్మల్ గా మారాయి. లిప్ ఫిల్లర్స్ ను ట్రై చేసి తప్పు చేశా.. నా రూపం చూసి నేనే నవ్వుకున్నా.. అలాగే ఎంతో బాధపడ్డా.. ఇన్నాళ్లకు లిప్ ఫిల్లర్స్ ను కరిగించుకున్నా అని తెలిపింది. ఉర్ఫి జావేద్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇది కూడా చదవండి: ఓ తరానికి ఇన్స్పిరేషన్ ఈ హీరోయిన్..! అప్పుడు 96 కేజీలు.. ఇప్పుడు జీరో సైజ్ బ్యూటీ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








