అభిమాని కాదు భక్తుడు..! చిరంజీవి తాగిన టీ కప్పును 20 ఏళ్లుగా దాచుకున్న నటుడు..
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో బాస్ అంటే టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో సినిమాలు మరెన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు చిరంజీవి. అనతికాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మెగాస్టార్ సినిమా వస్తుందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ కు పూనకాలే.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్.. యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్థుహం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది విశ్వంభర.. అలాగే మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కంబోనేషన్ లోనూ ఓ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్ తో జరుగుతుంది.
ఇది కూడా చదవండి : సినిమా మొత్తం రచ్చ.. బోల్డ్ సీన్స్ అరాచకంతో థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే.!
కాగా చిరంజీవికి ఎంతో మందిఅభిమానులు ఉన్నారు. అన్నయ అంటే ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ కు లెక్కేలేదు. చిరంజీవి బర్త్ డే రోజున అన్నదానాలు, రక్త దానాలు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఓ నటుడు మెగాస్టార్ తాగిన టీ కప్పును ఏకంగా 20ఏళ్లుగా దాచుకున్నాడు. అవును నిజం ఈ విషయాన్ని ఆ నటుడే స్వయంగా తెలిపారు. చిరంజీవి తాగిన టీ కప్పును దాచుకున్న నటుడు ఎవరో కాదు.. ఒకప్పుడు తన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన శివ రెడ్డి.
ఇది కూడా చదవండి : Jabardasth: నాకోసం పెళ్లి పీటలమీదనుంచి వచ్చేసేది.. లవ్ స్టోరీ బయట పెట్టిన జబర్దస్త్ నరేష్..
శివారెడ్డి .. ఈ కమెడియన్ తన కామెడీ టైమింగ్ తోనే కాదు మిమిక్రీతో పాపులర్ అయ్యారు. ఎన్నో సినిమాల్లో హీరో ఫ్రెండ్ రోల్స్ లో కనిపించాడు. అలాగే కొన్ని సినిమాల్లో నెగిటివ్ రోల్స్ లోనూ కనిపించి మెప్పించారు. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించిన శివ రెడ్డి ఇటీవల ఓ డిజిటల్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన ఇంటిని పరిచయం చేశారు. తనకు వచ్చిన అవార్డులు , జ్ఞాపికలను చూపిస్తున్న సమయంలో అక్కడ ఓ టీ కప్పు కనిపించింది అలాగే అందులో ఓ స్టార్ సింబల్ పెట్టి ఉంది. ఇదేంటి అని అడగ్గా ఆయన సమాధానమిస్తూ.. ఇది చిరంజీవి గారు తాగిన టీ కప్పు.. ఆయన గుర్తిగా దాచుకున్న అందుకే ఇందులో స్టార్ సింబల్ పెట్టా .. ఆయన మెగాస్టార్ కదా..! లక్షల రూపాయిలు ఇచ్చినా కూడా ఈ టీ కప్పును ఎవ్వరికీ ఇవ్వను అని తెలిపారు శివారెడ్డి.
ఇది కూడా చదవండి : బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు గురూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








