AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు గురూ..

ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి సంచలన విజయం తర్వాత దేవర సినిమాతో హిట్ కొట్టాడు తారక్. ఈ సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. మాములుగా రాజమౌళి సినిమా తర్వాత ఆ హీరో చేసే సినిమాలు ఫ్లాప్ అవుతాయని టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ ఉంది. దాన్ని తారక్ బ్రేక్ చేశాడు.

బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు గురూ..
Bala Ramayanam
Rajeev Rayala
|

Updated on: Jul 15, 2025 | 12:10 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పరిచయం కాక ముందే బాలనటుడిగా అలరించారు. తారక్ బాలనటుడిగా నటించిన సినిమా బాలరామాయణం. బాల రామాయణం 1996 లో అందరూ పిల్లలతో నిర్మించిన పౌరాణిక తెలుగు సినిమా ఇది. ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ మల్లెమాల సుందర రామిరెడ్డి గారు నిర్మించారు. ఇందులో జూనియర్ ఎన్.టి.ఆర్ రామునిగా నటించాడు. ఈ చిత్రం భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు – ఉత్తమ బాలల సినిమా గా ఎంపికచేయబడినది.ఇక ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన చిన్నారి ఎవరో తెలుసా.. ఆమె పేరు స్మిత మాధవ్. ఈ సినిమా వచ్చి పాతికేళ్ల అయ్యింది. ఇక ఇప్పుడు ఈ చిన్నారి సీత ఎలా ఉందో తెలుసా..?

ఇది కూడా చదవండి :ఏం సినిమా రా అయ్యా..! అమ్మాయిలను మాత్రమే చంపే కిల్లర్.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు

స్మితా మాధవ్ కర్నాటిక్ క్లాసికల్ సింగర్ అలాగే భరతనాట్యం డాన్సర్. శృతి లయ కేంద్ర నటరాజాలయ డైరెక్టర్ గురు నృత్య చూడామణి శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ ద్వారా స్మిత భరతనాట్యంలో శిక్షణ పొందింది. స్మిత హైదరాబాద్ సిస్టర్స్‌గా ప్రసిద్ధి చెందిన శ్రీమతి లలిత, శ్రీమతి హరిప్రియ దగ్గర కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది. స్మిత తెలుగు విశ్వవిద్యాలయం నుండి సంగీతం, నృత్యంలో డిప్లొమా ప్రోగ్రామ్‌ను పూర్తి చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్‌లోకి ఫోక్ సింగర్.. దేశాన్నే ఊపేసిన పాటలు పాడింది

ఇందిరకళ సంగీత విశ్వ విద్యాలయం నుంచి నృత్యంలో మాస్టర్స్ అలాగే మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో మాస్టర్స్ అందుకుంది. ఇక బలరామాయణం సినిమా తర్వాత ఆమధ్య ఆర్ట్ ఫిల్మ్ పృథ్వీలో స్మిత కథానాయికగా నటించింది. బుల్లితెరపై, స్మిత పలు భాషల్లో అనేక షోలకు యాంకరింగ్ చేసింది. ఇక ఇప్పుడు ఆమె పలు స్టేజ్ షోలు ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉందని స్మిత.. అడపాదడపా తన డాన్స్ వీడియోలు, ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి : అందం ఎక్కువైంది.. ఆఫర్ మిస్ అయ్యింది..! బడా సినిమా నుంచి స్టార్ హీరోయిన్ అవుట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.