స్టార్ హీరో సినిమాలో గెస్ట్‌రోల్‌లో ప్రభాస్.. కన్నప్ప కంటే ముందే చేశాడు.. ఆ మూవీ ఎదో తెలుసా..?
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గురించి, అతని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా, నిజం చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా డార్లింగ్ కు క్రేజ్ ఉంది. చైనా, జపాన్ వంటి దేశాల్లోనూ ఇప్పుడు ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో సందడి చేస్తే ఫ్యాన్స్ కు భలే థ్రిల్ గా అనిపిస్తుంది. అలాగే ఒక హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ గా కనిపిస్తే ఇక థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. ఇప్పటికే చాలా సినిమాల్లో హీరోలు గెస్ట్ రోల్స్ లో కనిపించి మెప్పించారు. సీతమ్మ వాకిట్లో, మనం, ఆర్ఆర్ఆర్, ఇటీవల వచ్చిన కన్నప్పలాంటి మల్టీస్టారర్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే ఓ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారని మీకు తెలుసా.? కన్నప్ప సినిమానే కాదు మరో స్టార్ హీరో సినిమాలోనూ ప్రభాస్ గెస్ట్ గా కనిపించారు. ఇది విని చాలా మంది షాక్ అవుతున్నారు. కానీ ఇది నిజం.
ఇది కూడా చదవండి : సినిమా మొత్తం రచ్చ.. బోల్డ్ సీన్స్ అరాచకంతో థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే.!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సలార్ సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్.. ఆతర్వాత కల్కి సినిమాతో ఏకంగా వెయ్యికోట్లు వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేశారు. ఆతర్వాత ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో సలార్ 2, కల్కి 2, రాజా సాబ్, హను రాఘవపూడి సినిమా, అలాగే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాల్లో నటిస్తున్నాడు. త్వరలో రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది కూడా చదవండి : Jabardasth: నాకోసం పెళ్లి పీటలమీదనుంచి వచ్చేసేది.. లవ్ స్టోరీ బయట పెట్టిన జబర్దస్త్ నరేష్..
ప్రభాస్ గెస్ట్ రోల్ లో నటించిన సినిమా ఎవరిదో కాదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన సినిమా. ప్రభాస్ తో పాటు ఎన్టీఆర్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర సినిమాతో హిట్ అందుకున్నాడు తారక్. అలాగే ఇప్పుడు బాలీవుడ్ మూవీ వార్ 2, అలాగే దేవర 2 , ప్రశాంత్ నీల్ సినిమాలను లైనప్ చేశారు. కాగా ఎన్టీఆర్ నటించిన సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారని చాలా మందికి తెలిసి ఉండదు. ఆ సినిమా ఎదో కాదు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ. ఈ సినిమాలో ప్రభాస్ కూడా కనిపిస్తాడు. కానీ సినిమాలో కాదు టైటిల్ కార్డ్స్ పడే సమయంలో విశ్వామిత్రా ప్రొడక్షన్స్ కోసం టెస్ట్ షూట్‌లో కనిపించాడు. కానీ ముని వేషంలో ఉన్న ప్రభాస్ ను కనిపెట్టలేరు. అలా తారక్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించాడు.
ఇది కూడా చదవండి : బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు గురూ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








