AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారని తెలుస్తుంది.

మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..
Tollywood News
Rajeev Rayala
|

Updated on: Jul 24, 2025 | 4:46 PM

Share

సునీల్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘మర్యాద రామన్న’. 2010లో విడుదలైన ఈ ఫ్యామిలీ కామెడీ యాక్షన్ డ్రామా లో సలోని హీరోయిన్ గా నటించింది. అలాగే నాగినీడు, సుప్రీత్, ప్రభాకర్, బ్రహ్మాజీ, రావు రమేష్, చత్రపతి శేఖర్.. ఇలా భారీ తారగణం ఇందులో కనిపించింది. ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగే ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా మెప్పించింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోగా వెలుగొందుతున్న ఒక నటుడు ఇదే మర్యాద రామన్న సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించాడు. పై ఫొటోలో సునీల్ పక్కనున్నది అతనే. సినిమాలో సునీల్ కు నాగినీడు ఇంటికి దారిచూపే రాయలసీమ కుర్రాడు ఓబులేశ్ పాత్రలో కొద్ది సేపు అలా కనిపిస్తాడీ టాలీవుడ్ క్రేజీ హీరో. మరి అతనెవరో గుర్తు పట్టారా? మర్యాద రామన్నతో పాటు పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఆ హీరో ఇటీవలే ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఖాతాలో వేసుకున్నాడు.

ఇది కూడా చదవండి : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్

ఇంకో విశేషమేమిటంటే.. ఆ క్రేజీ హీరో ఇటీవలే పెళ్లి పీటలెక్కాడు. అది కూడా మురళి మోహన్ మనవరాలితో. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? ఆ కుర్రాడు మరెవరో కాదు మత్తు వదలరా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీ సింహా కోడూరి. రాజమౌళి అన్న కీరవాణి కుమారుడు శ్రీ సింహా ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. విక్రమార్కుడు లో మార్వాడి పెళ్లి ఇంట్లో చాలా మంది పిల్లలు అల్లరి చేస్తుంటార. అందులో శ్రీసింహా కూడా ఉంటాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఎలాంటి అమ్మాయి ఎలా మార్చేశారా..! నటనతో పిచ్చెక్కించిన ఈ భామ ఎవరో తెలుసా..?

ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్ర చేసింది శ్రీ సింహనే. మర్యాద రామన్న సినిమాలోనూ మెరుస్తాడు. అయితే అతను శ్రీ సింహా అన్నది వెంటనే గుర్తుపట్టలేం. ఇక మత్తు వదలరా సినిమాలో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీ సింహా ఆ తర్వాత తెల్లవారితే గురువారం, ఉస్తాద్, భాగ్ సాలే సినిమాల్లోనూ కథానాయకుడిగా మెరిశాడు. ఇటీవలే మత్తు వదలరా 2 తో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు వైవాహిక బంధంలోనూ అడుగు పెట్టాడు.

ఇది కూడా చదవండి :18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. రెండు సార్లు విడాకులు.. చివరకు ఇప్పుడు ఇలా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను
ఏరికోరి తెచ్చుకుంటే.. చెన్నైకి తలనొప్పిలా తయారైన శాంసన్
ఏరికోరి తెచ్చుకుంటే.. చెన్నైకి తలనొప్పిలా తయారైన శాంసన్