AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకాశమే హద్దుగా.. అమ్మాయిలకు ఉచిత పైలట్ శిక్షణ అవకాశం! ఇంటర్ పాసైతే చాలు

ఇంటర్ పూర్తి చేసిన తెలంగాణ విద్యార్థినులకు శుభవార్త. ఇండిగోరీచ్, తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ కలిసి ఉచిత పైలట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఎంపికైన అభ్యర్థులకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL), ATR టైప్ రేటింగ్‌తో పాటు బస, భోజనం, వైద్య బీమా, మెంటార్‌షిప్, కెరీర్ మార్గదర్శకత్వం పూర్తిగా ఉచితంగా అందించనున్నారు..

ఆకాశమే హద్దుగా.. అమ్మాయిలకు ఉచిత పైలట్ శిక్షణ అవకాశం! ఇంటర్ పాసైతే చాలు
Free Pilot Training Program For Telangana Students
Srilakshmi C
|

Updated on: Aug 06, 2026 | 3:48 PM

Share

హైదరాబాద్, ఆగస్ట్ 5: పైలట్ కావాలనే కలలు కంటున్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇంటర్ పూర్తి చేసిన అర్హత కలిగిన విద్యార్థినులకు ఉచితంగా పైలట్ శిక్షణ అందించేందుకు ఇండిగో సంస్థ సీఎస్‌ఆర్ విభాగం ‘ఇండిగోరీచ్’ మరియు తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ మంగళవారం అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పంద పత్రాలను ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ మరియు భారత్ కేర్స్ ట్రస్ట్ ప్రతినిధి సి. సాయి పరస్పరం మార్చుకున్నారు.

తెలంగాణ ఉచిత పైలట్‌ ట్రైనింగ్‌ శిక్షణ ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

‘Giving Wings to Fly’ కార్యక్రమం ద్వారా శిక్షణ

ఇండిగోరీచ్, భారత్ కేర్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘Giving Wings to Fly’ కార్యక్రమం ద్వారా ఎంపికైన విద్యార్థినులకు కమర్షియల్ పైలట్‌గా ఎదగడానికి అవసరమైన పూర్తి శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమం కింద సుమారు 20 నెలల పాటు శిక్షణ కొనసాగనుంది. ఈ శిక్షణలో అభ్యర్థులకు.. కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL), ATR Type Rating ట్రైనింగ్, వసతి, భోజన సౌకర్యం, వైద్య బీమామెంటార్‌షిప్, కెరీర్ మార్గదర్శకత్వం వంటి అన్ని సదుపాయాలను సంబంధిత సంస్థలే పూర్తిగా భరిస్తాయి. ఈ సందర్భంగా ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన అమ్మాయిలు పైలట్ కావాలనే తమ కలను సాకారం చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, వెబినార్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఉచిత పైలట్‌ ట్రైనింగ్‌ శిక్షణ ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎలా దరఖాస్తు చేయాలంటే..?

అర్హత కలిగిన విద్యార్థినులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమం కింద శిక్షణ పొందిన అమ్మాయిలు లైసెన్స్‌ పొందిన పైలెట్లుగా కొనసాగుతారు.

Follow Us