AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్క్ జుకర్‌బర్గ్ బహిరంగ క్షమాపణలు

ప్రధాని మోదీ వీడియో తొలగించడంపై ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటాకే పార్లమెంటరీ కమిటీ డెడ్ లైన్ విధించింది. మూడు రోజుల్లోగా మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్‌ క్షమాపణలు చెప్పాలని పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం జారీ చేసింది. అయితే వెంటనే మెటా అధినేత నుంచి ఒక ప్రకటన వెలువడింది.

మార్క్ జుకర్‌బర్గ్ బహిరంగ క్షమాపణలు
Meta Ceo Mark Zuckerberg
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Aug 05, 2026 | 5:01 PM

Share

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంస్థ నిర్వహణలో జరిగిన కొన్ని తీవ్రమైన లోపాలపై బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. ముఖ్యంగా బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSAM), డీప్‌ఫేక్ వీడియోలు, హానికరమైన కంటెంట్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టడంలో మెటా విఫలమైందని అంగీకరించారు. వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని, ఆ విషయంలో జరిగిన పొరపాట్లకు చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా ఈ రోజు ఉదయం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు పార్లమెంటరీ సమాచార సాంకేతిక స్థాయీ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మూడు రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని కమిటీ ఆదేశించింది. లేనిపక్షంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3) కింద కంపెనీకి ఉన్న రక్షణను ఉపసంహరించి, ప్రచురణకర్తగా పరిగణించి చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.

లోక్‌సభ సచివాలయం నుంచి ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి పంపిన లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. పరీక్షల వివాదాలు, పేపర్ లీక్‌లపై విద్యార్థులు, జెన్-జెడ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్ ఐదు నుంచి ఆరు గంటల పాటు అందుబాటులో లేకుండా చేయడాన్ని కమిటీ తీవ్రంగా పరిగణించినట్లు పేర్కొన్నారు.

అంతేకాకుండా బాలల లైంగిక వేధింపుల కంటెంట్ (CASM), మహిళలను కించపరిచే పోస్టులను తొలగించడంలో విఫలమయ్యే సోషల్ మీడియా మధ్యవర్తి వేదికలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ కోరింది. ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇదే సమావేశంలో మోసపూరిత యాప్‌ల ద్వారా పెట్టుబడిదారులు రూ.48 లక్షలకు పైగా నష్టపోయిన కేసులో గూగుల్ ఇండియా పాత్రపై కూడా చర్చ జరిగింది. సైబర్ మోసగాళ్లతో పాటు సంబంధిత సంస్థల బాధ్యతను కూడా పరిశీలించాలని కమిటీ అభిప్రాయపడింది.

Follow Us
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..
రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు
గురు మౌఢ్య త్యాగంతో ఆ రాశులకు మహర్దశ.. వారికి ఆకస్మిక ధనలాభం
గురు మౌఢ్య త్యాగంతో ఆ రాశులకు మహర్దశ.. వారికి ఆకస్మిక ధనలాభం
NEET UG 2026లో OMR షీట్ల వివాదం..సుప్రీం తలుపుతట్టిన విద్యార్ధులు
NEET UG 2026లో OMR షీట్ల వివాదం..సుప్రీం తలుపుతట్టిన విద్యార్ధులు
ఎర్ర ఇటుక, సిమెంట్ ఇటుక, ఫ్లైయాష్ బ్రిక్.. ఏది మంచిది?
ఎర్ర ఇటుక, సిమెంట్ ఇటుక, ఫ్లైయాష్ బ్రిక్.. ఏది మంచిది?
రెండు దశాబ్దాల తర్వాత ఆర్బీఐ ఊహించని డెసిషన్.. వాటికి లైసెన్సులు
రెండు దశాబ్దాల తర్వాత ఆర్బీఐ ఊహించని డెసిషన్.. వాటికి లైసెన్సులు