AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు

దేశ రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. అత్యంత రద్దీగా ఉండే ఏడు హై-డెన్సిటీ రైల్వే మార్గాలను నాలుగు లైన్లుగా విస్తరించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దాదాపు 11,000 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మార్గాలు దేశ రైల్వే నెట్‌వర్క్‌లో కేవలం 16 శాతం ఉన్నప్పటికీ.. మొత్తం రైల్వే ట్రాఫిక్‌లో 41 శాతం రాకపోకలను ఇవే నిర్వహిస్తున్నాయి.

భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు
Indian Railways
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Aug 26, 2026 | 7:37 PM

Share

భారత దేశంలో అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వే వ్యవస్థ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ పెట్టింది..ఇప్పటి వరకు దేశంలో హైవే లో ఫోర్ లైన్ వ్యవస్థ చూశాం..ఇకపై రైల్వేలో 4 లైన్ల వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దేశంలోని అత్యంత రద్దీగా ఉండే హై-డెన్సిటీ రైల్వే మార్గాలను నాలుగు లైన్లుగా విస్తరించబోతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు…దేశ రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యాన్ని భారీగా పెంచే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది…ఇందులో భాగంగా దేశంలోని ఏడు కీలక హై-డెన్సిటీ రైలు మార్గాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మార్గాల మొత్తం పొడవు దాదాపు 11,000 కిలోమీటర్లుగా ఉంది..దేశ రైల్వే నెట్‌వర్క్‌లో ఇవి కేవలం 16 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, మొత్తం రైల్వే ట్రాఫిక్‌లో 41 శాతం రాకపోకలను ఈ మార్గాల గుండానే సాగుతున్నాయి

ఏడు కీలక మార్గాలు

ఢిల్లీ–హౌరా

హౌరా–చెన్నై

చెన్నై–ముంబై

ముంబై–ఢిల్లీ

ఢిల్లీ–చెన్నై

ముంబై–హౌరా

ఢిల్లీ–గువాహటి

ప్రస్తుతం ఉన్న ఈ హై-డెన్సిటీ మార్గాలను నాలుగు రైల్వే లైన్లుగా విస్తరించడం ద్వారా ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా రైళ్లకు అదనపు సామర్థ్యం అందుబాటులోకి రానుంది.భవిష్యత్తులో పెరిగే ప్యాసింజర్, ఫ్రైట్ ట్రాఫిక్‌ను సులభంగా ఎదుర్కొనేందుకు ఈ విస్తరణ చాలా కీలకంగా కేంద్రం భావిస్తుంది..రైల్వే రవాణా వల్ల తక్కువ రవాణా ఖర్చులు, తక్కువ కాలుష్యం, పర్యావరణానికి మేలు జరుగుతుందని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. దేశంలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో సామర్థ్యాన్ని భారీగా పెంచే దిశగా హై-డెన్సిటీ నెట్‌వర్క్ ఫోర్-లైనింగ్ కీలక అడుగుగా నిలవనుంది.

నాలుగు లైన్ల (ఫోర్-లైనింగ్) ప్రాజెక్ట్ కి 4.2 లక్షలకోట్లకు పైగా ఖర్చు

దేశంలోని 7 కీలక హై-డెన్సిటీ రైల్వే మార్గాలలో మొత్తం 11,000 కి.మీ.ను నాలుగు లైన్లుగా విస్తరించే ప్రణాళికకు సంబంధించిన ఖర్చులు భారీగా ఉండనున్నాయి..2023లో భారతీయ రైల్వేలు ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం, ఈ 7 హై-డెన్సిటీ కారిడార్‌ల మల్టీ-ట్రాకింగ్ (డబులింగ్,థర్డ్ , ఫోర్త్ లైన్లు) కోసం 4.2 లక్షల కోట్లు కంటే ఎక్కువ పెట్టుబడి అవసరమని కేంద్రం అంచనా వేసింది.. ఇది సుమారు 10 సంవత్సరాల కాలంలో (2024-25 నుంచి 2033-34 వరకు) పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుంది…ప్రస్తుతం మొత్తం ప్రాజెక్టుకు ఒకే సారి పూర్తి బడ్జెట్ మంజూరు కాకుండా, వివిధ సెక్షన్లుగా క్యాబినెట్ ఆమోదం తీసుకుంటూ పనులు జరుగుతున్నాయి.ఇప్పటివరకు హౌరా చెన్నై మార్గంలో ఫోర్ లైనింగ్ కోసం 410 కి.మీ గాను 9450 కోట్లు కేంద్రం కేటాయించింది..ఈ ప్రాజెక్టులు సెక్షన్-వారీగా ఆమోదం పొందుతున్నాయి కాబట్టి మొత్తం 11,000 కి.మీ.కు ఖచ్చితమైన తుది ఖర్చు ఇంకా నిర్ధారణ కాలేదు. దీని ఖర్చు భూసేకరణ, బ్రిడ్జ్‌లు, టన్నెల్స్, సిగ్నలింగ్ వంటి అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది…

Follow Us
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు
కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!
కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!