Samantha: గ్రాండ్‌గా సమంత కొత్త సినిమా ఓపెనింగ్.. పూజా కార్యక్రమంలో సందడి చేసిన రాజ్ నిడిమోరు.. వీడియో
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. తమ ప్రేమ విషయాన్ని అఫీషియల్‌గా బయటికి చెప్పకపోయినా పలు ఈవెంట్లు, ఫంక్షన్లలో జంటగానే కనిపిస్తున్నారు సామ్, రాజ్. తాజాగా సమంత కొత్త సినిమా ఓపెనింగ్ లోనూ బాలీవుడ్ దర్శకుడు సందడి చేశాడు.

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా ‘మా ఇంటి బంగారం’ను సగర్వంగా ప్రారంభించినట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది బ్యానర్ నుంచి వచ్చిన ‘శుభం’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ‘మా ఇంటి బంగారం’ సినిమాలో సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఓ బేబి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ చిత్రానికి ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా… సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సీతా మీనన్. వసంత్ మరిన్‌గంటి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. పల్లవి సింగ్ కాస్ట్యూమర్, ఉల్లాస్ హైదర్ ప్రొడక్షన్ డిజైనర్, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా వర్క్‌చేస్తున్నారు.
సన్నిహితులు, శ్రేయోభిలాషుల ఆత్మీయ కలయిక, ఆశీర్వాదాలతో ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రారంభమైంది. మూవీ ఫస్ట్ లుక్‌ను గమనిస్తే గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామాగా అనిపించింది. అద్భుతమైన యాక్షన్ బ్యాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. సినిమా షూటింగ్ ప్రారంభమైందని, మరిన్ని వివరాలను తెలిజేస్తామని మేకర్స్ పేర్కొన్నారు.
సమంత కొత్త ఓపెనింగ్ లో రాజ్ నిడిమోరు.. వీడియో ఇదిగో..
Started our journey with the Muhurtham of #MaaIntiBangaram, surrounded by love & blessings. ✨ We can’t wait to share with you what we’re creating… need all your love and support as we begin this special film. ❤️#MIB #Samantha #TralalaMovingPictures @TralalaPictures… pic.twitter.com/PwICPNsP8R
— Samantha (@Samanthaprabhu2) October 27, 2025
కాగా సమంత నిర్మించిన మొదటి సినిమా శుభం సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మా ఇంటి బంగారం అంటూ మరో కొత్త సినిమాతో మన ముందుకు రానుందీ అందాల తార.
The wait has been long, but the moment has finally arrived! ✨ With hearts full of joy, we’ve begun filming our Production No #2 – #MaaIntiBangaram.
This one is truly special for us… and we can’t wait to bring it to you.
See you soon with a bang 💥😉 #MIB #Samantha pic.twitter.com/0pBUlz5RcT
— Tralala Moving Pictures (@TralalaPictures) October 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








