Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ వీడియో
మెగాస్టార్ చిరంజీవి డీప్‌ఫేక్ వీడియోలు కలకలం రేపాయి. సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోలను పోస్ట్ చేశారు. చిరంజీవి ఫిర్యాదుతో కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 30 మందికి నోటీసులు జారీ చేయగా, తాజాగా మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన డీప్‌ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టించాయి. సైబర్ నేరగాళ్లు చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలను తయారు చేసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై చిరంజీవి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే చిరంజీవి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు పొందారు. సామాజిక మాధ్యమాల వేదికగా తమ పేరు, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. టీఆర్పీ, లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kakinada: సైక్లోన్ ప్రభావంతో కిక్కిరిసిన మార్కెట్లు, రైతు బజార్లు
Supreme Court: వీధి కుక్కల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
Delhi Air Pollution: ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

