ఆకాశంలో అద్భుత దృశ్యం.. పులకించిపోయిన భక్తులు
సాధారణంగా వర్షం కురిసిన తర్వాత మబ్బులు తొలగిపోయి..లేలేత ఎండ పడుతున్నప్పుడు ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడటం మనం చూస్తుంటాం. వాతావరణంలోని నీటి బిందువులపై పడిన సూర్య కిరణాలు పడటడం వలన అవి వక్రీభవనం చెంది ఇలా ఇంద్రధనస్సులు ఏర్పడతాయి. బుధవారం ఓ శివాలయంపై ఆకాశంలో అద్భుతమైన ఇంద్రధనుస్సు ఏర్పడింది.
అది ఆకాశానికి ఎక్కుపెట్టిన హరివిల్లులా కనువిందు చేసింది. ఆ సుందర దృశ్యాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో బుధవారం ఈ అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం నుంచి దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో స్థానికంగా వర్షం కురిసింది. కొద్దిసేపటికి వాన ఆగగానే మేఘాలు తొలగి ఆకాశం మెల్లగా స్పష్టమవుతుండగా, వర్షపు చినుకులపై సూర్యకాంతి పడడంతో ఆకాశం మీద అద్భుతమైన ఇంద్రధనుస్సు ఏర్పడింది. స్ధానిక శివాలయంలోని ధ్వజ స్థంభం మీదుగా ఆ ఇంధ్రధనుస్సు ఏర్పడటంతో హరివిల్లు ఎక్కుపెట్టినట్టుగా అద్భుతంగా కనిపించింది. గ్రామస్తులందరి చూపులూ ఒక్కసారిగా ఆకాశంవైపు మళ్లాయి. రంగురంగుల కాంతుల విల్లు ధ్వజస్తంభాన్ని తాకేలా ఆకాశాన్ని అలంకరించడం విశేషంగా కనిపించింది. శివాలయం వద్ద ఉన్న భక్తులు ఆ అందమైన దృశ్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. కొందరు మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆన్‌లైన్‌లో రూ.4 కోట్ల వాచ్ ఆర్డర్ చేశాడు.. డెలివరీ వచ్చింది చూసి
జాతి వైరం మరచి.. పసికూనల ఆకలి తీర్చి
చూసి తీరాల్సిన రిచ్ కంట్రీ ఏడుగురే ఖైదీలు.. వంద మంది పోలీసులు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

