జాతి వైరం మరచి.. పసికూనల ఆకలి తీర్చి
ఆకలితో ఉన్న ఎవరికైనా పట్టెడన్నం పెడితే వారికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అందుకే ఎంతటి శత్రువు అయినా ఆకలి అంటూ వస్తే కండుపునిండా భోజనం పెట్టడం మానవ ధర్మం. ఇది మనుషుల్లోనే కాదు పశుపక్ష్యాదుల్లోనూ కనిపిస్తుంది. కుక్కను చూడగానే పంది పరుగులు పెడుతుంది.. అలాగే పంది కంటపడితే కుక్క ఓ పట్టాన వదలదు.
అలాంటి రెండు బద్ధ శత్రువులైన జంతువులు సామరస్యంగా మెలిగితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. తల్లిని కోల్పోయి అనాధలుగా మిగిలిన కుక్క పిల్లలకు పాలిచ్చి తల్లిలా వాటి ఆకలి తీర్చింది ఓ వరాహం. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ నగర పంచాయతీ పరిధిలోని గ్యాస్ గోడౌన్ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆకలితో అలమటిస్తున్న కుక్క పిల్లలకు వరాహం పాలిస్తున్న సంఘటన చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అటుగా వెళ్తున్న ఓ పెద్ద వరాహాన్ని చూసి కుక్క పిల్లలు తమ తల్లిగా భావించాయో లేక దానిని చూడగానే వాటికి ఆకలి గుర్తుకు వచ్చందో కానీ పరుగు పరుగున వెళ్ళి ఆ పందిని చుట్టుముట్టాయి. ఓ ఐదారు కుక్కపిల్లలు పాలు తాగడం మొదలు పెట్టాయి. తన పిల్లలు కాకపోయినా ఆ వరాహం వాటిని విదిలించుకొని వెళ్లిపోలేదు. కుక్కపిల్లలు పాలు తాగుతున్నంతసేపూ కదలకుండా నిల్చుని వాటి ఆకలి తీర్చింది. ఈ ఘటన స్థానికులను కదిలించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చూసి తీరాల్సిన రిచ్ కంట్రీ ఏడుగురే ఖైదీలు.. వంద మంది పోలీసులు
ఇంట్లో కర్పూరంతో ఇలా చేయండి.. ఫలితం మీరే చూడండి
దేవుడి ప్రసాదాన్ని దొంగిలిస్తారు.. ఎక్కడంటే
క్రెడిట్ స్కోర్ ఎంతకీ పెరగట్లేదా ?? ఈ తప్పులు చేస్తున్నారేమో చూడండి
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

