క్రెడిట్ స్కోర్ ఎంతకీ పెరగట్లేదా ?? ఈ తప్పులు చేస్తున్నారేమో చూడండి
ఎక్కువ మంది క్రెడిట్ స్కోర్ అనే మాట గురించి తెలిసినా పట్టించుకోరు. కొత్త రుణానికి ప్రయత్నించినప్పుడు అందుకోసం బ్యాంకులు క్రెడిట్ స్కోరు మీద ఎంతలా ఆధారడపతాయో అందరికీ తెలియకపోవచ్చు. మాములుగా 750 పైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి సులువుగా లోన్‌లు ఇస్తాయి. అందుకే మీ రుణ దరఖాస్తు తిరస్కరణకు గురి కాకూడదనుకుంటే ముందే క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకోవాలి.
క్రెడిట్ కార్డు, రుణానికి సంబంధించి చెల్లింపులు సరిగ్గా జరకపోతే మాత్రమే అది క్రెడిట్ హిస్టరీ మీద ప్రభావం చూపుతుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే, విద్యుత్ లేదా టెలిఫోన్ బిల్లు వంటివి సకాలంలో చెల్లించకపోయినా క్రెడిట్ హిస్టరీ మీద ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి. పేమెంట్ హిస్టరీ అనేది 30 శాతం వరకూ క్రెడిట్ స్కోరును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రుణం తీసుకుని మొత్తం కట్టేసిన తర్వాత, పూర్తిగా క్లోజ్ చేయాలి. అప్పుడు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఆ రుణాన్ని సెటిల్డ్ అనే కేటగిరి కింద పరిగణిస్తాయి. ఒకవేళ రుణం కాస్త పెండింగ్ ఉన్నా, ఆ ఖాతాకు సంబంధించి నెగటివ్ ముద్రవేస్తారు. ఇలా, ఒక ఖాతా లేదా ఒకటి కంటే ఎక్కువ నెగటివ్ ఖాతాలుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. క్రెడిట్ స్కోరును ప్రభావితం చేసేవాటిలో క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ముఖ్యం. ఇది దాదాపు 30 శాతం క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, మీ క్రెడిట్ కార్డుకు ఇచ్చిన పరిమితి లక్ష రూపాయలు అనుకుంటే అందులో ఖర్చు అరవై వేలు ఉన్నట్లయితే, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను అరవై శాతంగా అర్థం చేసుకోవాలి. దీంతో, మీరు అప్పును ఎలా మేనేజ్ చేస్తారు? మీ క్రెడిట్‌కార్డు వాడకం అలవాట్లు వంటివి తెలుస్తాయి. బ్యాంకుల్లో రుణాల కోసం ప్రయత్నించినప్పుడు అవి మీ ప్రొఫైల్ గురించి క్రెడిట్ స్కోరు అందించే సంస్థల వద్ద విచారిస్తాయి. కొంతమంది అవసరం లేకపోయినా ఎక్కువ క్రెడిట్ కార్డులు, వివిధ బ్యాంకుల్లో రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఎక్కువ అప్పులు తీసుకుని మంచి లైఫ్ స్టయిల్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇలా ఎక్కువ రుణాలు తీసుకుంటే అది క్రెడిట్ స్కోరుపై రుణాత్మక ప్రభావం చూపుతుంది. ఎక్కువ రుణ విచారణలు చేసినవారి విషయంలో క్రెడిట్ స్కోరు మీద పది శాతం ప్రభావం చూపుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంధులకు కంటిలో చిప్ .. టెక్నాలజీ ద్వారా చూపు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

