AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: నిద్రతో డయాబెటిక్‌కు చెక్‌..

Diabetes: నిద్రతో డయాబెటిక్‌కు చెక్‌..

Phani CH
|

Updated on: Oct 27, 2025 | 1:33 PM

Share

మారుతున్న జీవన శైలి కారణంగా చిన్న వయసులోనే మధుమేహం భారిన పడుతున్నారు. గతంలో ఆరవై ఏళ్లు దాటితే గానీ కనపడని షుగర్‌ జబ్బు ప్రస్తుతం నలభై ప్రాయంలోనే నట్టేట ముంచేస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తున్నా కొందరిలో మధుమేహం అదుపులోకి రాదు. అయితే దీనికి నిద్రలేమి కూడా ఓ ప్రధాన కారణమంటున్నారు నిపుణులు.

కొంతకాలం ఎలాంటి తగ్గుదల లేని కొందరు మధుమేహ వ్యాధిగ్రస్తులపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించారు. ఏడు గంటల కచ్చిత నిద్రతో షుగర్‌ను అదుపు చేయొచ్చని చెబుతున్నారు. నిద్రలేమి వల్ల గ్లూకోజ్ జీవక్రియలు, ఇన్సులిన్, హార్మోన్ నియంత్రణ వంటివి దెబ్బతింటాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా నిద్రలేమి వల్ల శరీరంలో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు ప్రేరేపితమవుతాయి. ఇవి ఆకలితో పాటు.. రక్తంలో చక్కెర స్థాయులను కూడా పెంచుతాయి. సరైన నిద్ర వల్ల కార్టిసాల్ పెరుగుదలలో నియంత్రణ వస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరం తనకు కావాల్సిన శక్తిని పునరుద్ధరించుకోగలుగుతుంది. గ్లూకోజ్‌ను నియంత్రణలోకి వస్తుంది. జీవక్రియ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటి అలవాట్లతో పాటు ప్రతిరోజు ఏడు గంటలు నిద్రపోయిన వ్యక్తుల్లో HbA1c స్థాయుల తగ్గుదలను గుర్తించారు. తగిన నిద్ర వల్ల హార్మోన్ల సమతుల్యత, ఇన్సులిన్ సామర్థ్యం వంటివి మెరుగవడమే దీనికి కారణమని అధ్యయనం తెలిపింది. క్రమం తప్పకుండా ఒకే సమయానికి నిద్ర పోవడం, మేల్కొనడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, ప్రశాంతంగా నిద్ర పోయేందుకు బెడ్‌రూమ్‌ను చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచడం, నిద్రకు ముందు తక్కువ ఆహారం తీసుకోవడం, నిరాడంబరమైన జీవనశైలి దీనికి ఉపకరిస్తాయని అధ్యయనం పేర్కొంది. శరీరానికి తగిన విశ్రాంతి లభించినప్పుడు వ్యక్తిగత, వృత్తి సంబంధ విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికీ అవకాశం ఉంటుంది. వీటివల్ల పరోక్షంగా రక్తంలో షుగర్‌ లెవల్‌ నియంత్రణలోకి వస్తుందని గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జస్ట్ మిస్‌.. లేదంటే వీళ్లద్దిర కాంబోతో బాక్సాఫీస్ బద్దలయ్యేదే..

లిక్కర్ తాగి బిగ్ బాస్‌కు ? సల్మాన్ తీరుపై విమర్శలు! ఖండిస్తున్న ఫ్యాన్స్‌

హాట్సాఫ్ భయ్యా.. ఆరుగురిని కాపాడిన హీరో .. కర్నూలు బస్సు ప్రమాదం

బాలయ్యపై జగన్‌ వ్యాఖ్యలు.. భగ్గుమంటున్న కూటమి నేతలు, మంత్రులు

Weather Update: ఏపీకి తప్పని తుపాను ముప్పు