హాట్సాఫ్ భయ్యా.. ఆరుగురిని కాపాడిన హీరో .. కర్నూలు బస్సు ప్రమాదం
కర్నూల్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని దగ్ధం కావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అటుగా కారును డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న నవీన్, ప్రమాదం నుంచి బయటపడ్డ ఆరుగురిని తన కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. గాయపడ్డ వారికి సకాలంలో వైద్యం అందేలా చూసారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొంది. ఆ సమయంలో చెలరేగిన మంటల్లో చిక్కుకుని 19 మంది సజీవ దహనమయ్యారు. మిగతా ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అద్దాలు పగలగొట్టి బస్సు నుంచి బయటపడి ఆరుగురు ప్రాణాలను దక్కించుకున్నారు. ఆ ఆరుగురిని నవీన్ తన కారులో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. గాయపడ్డ వారి పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచారు. ఆ సమయంలో ఏం జరిగిందనే విషయాలను ఆయన మీడియాకు తెలిపారు. హిందూపూర్ నుంచి నంద్యాలకు తాను వెళుతుండగా బస్సు మంటల్లో దగ్ధమవుతూ కనిపించిందని నవీన్ చెప్పారు. బస్సులో నుంచి బయటపడ్డ ఆరుగురిని తన కారులో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలిపారు. బస్సు చుట్టూరా మంటలు వ్యాపించాయని, వాహనాన్ని సమీపించే అవకాశమే లేకుండా పోయిందని అన్నారు. రమేశ్ అనే ఓ ప్యాసెంజర్ బస్సు అద్దం పగలగొట్టుకుని బయటకు వచ్చినట్టు తెలిపారు. అది మనిషి పట్టేంత వెడల్పు కూడా లేకపోవడంతో కొందరికి గాజు గుచ్చుకుని గాయాలయ్యాయని అన్నారు. ఆరుగురు క్షేమంగానే ఉన్నారని చెప్పారు. ఇక పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న హైమా రెడ్డి.. బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి పోలీసులు సమాచారం అందించారు. బస్సును బైక్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. టూ వీలర్ నడుపుతున్న వ్యక్తి పక్కకు పడిపోగా బైక్ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుపోయింది. ఈ క్రమంలో పెట్రోల్ లీక్ కావడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు బస్సును దగ్ధం చేశాయి. బస్సు డ్రైవర్లలో ఒకరు పరారవ్వగా.. మరొకరు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలయ్యపై జగన్ వ్యాఖ్యలు.. భగ్గుమంటున్న కూటమి నేతలు, మంత్రులు
Weather Update: ఏపీకి తప్పని తుపాను ముప్పు
కర్నూలులో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

