బస్సు ప్రమాదానికి క్యాబిన్‌లో మొబైల్ ఫోన్లే కారణమా? వీడియో
కర్నూలు బస్సు ప్రమాదంపై ఫోరెన్సిక్ బృందాలు విశ్లేషణ చేస్తున్నాయి. లగేజ్ క్యాబిన్‌లో పెద్ద ఎత్తున ఉన్న మొబైల్ ఫోన్ల బ్యాటరీలు పేలడమే ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణమని నిపుణులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు ఈ నిబంధనలను ఎందుకు ఉల్లంఘించాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కర్నూలు బస్సు ప్రమాదంపై ఫోరెన్సిక్ బృందాల విశ్లేషణ కొనసాగుతోంది. ఈ ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణాలపై అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బస్సు లగేజ్ క్యాబిన్‌లో పెద్ద ఎత్తున తరలించిన మొబైల్ ఫోన్ల బ్యాటరీలు ఒక్కసారిగా పేలడమే భారీ ప్రాణనష్టానికి కారణమని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. వందల సంఖ్యలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు క్యాబిన్‌లో ఉండటం వల్లే ప్రమాద స్థాయి పెరిగిందని వారి విశ్లేషణలో వెల్లడైంది.ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లగేజ్ క్యాబిన్‌లో ఏం తరలిస్తున్నారో ఈ సంస్థలు ఎందుకు పట్టించుకోవడం లేదని, ప్రమాదకర వస్తువులను తరలించకూడదన్న నిబంధనలను ఎందుకు ఉల్లంఘించాయో అన్నదానిపై ఆరా తీస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్ సేఫ్టీ వీడియో
ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
ల్యాప్‌టాప్స్ చార్జింగ్ పెట్టడంతో వీడియో
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
