AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB 29: మహేష్ ఫ్యాన్స్‏కు క్రేజీ అప్డేట్.. ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది అప్పుడే.. హాలీవుడ్ రేంజ్‏లో ప్లాన్..

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. చివరగా గుంటూరు కారం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన మహేష్.. ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో బారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ సైతం నటిస్తుండడంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

SSMB 29: మహేష్ ఫ్యాన్స్‏కు క్రేజీ అప్డేట్.. ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది అప్పుడే.. హాలీవుడ్ రేంజ్‏లో ప్లాన్..
Ssmb 29
Rajitha Chanti
|

Updated on: Oct 19, 2025 | 10:04 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత జక్కన్న రూపొందిస్తున్న సినిమా కావడంతో మంచి హైప్ నెలకొంది. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో నిర్మిస్తున్న ఈమూవీ షూటింగ్ కొన్ని నెలలుగా విదేశాల్లో జరుగుతుంది. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకచోప్రాతోపాటు మరికొంతమంది బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాను ఆఫ్రికా అడువుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. దాదాపు 120 దేశాల్లో ఈ మూవీని ఒకేసారి రిలీజ్ చేయడంతోపాటు ఏకంగా రూ.10 వేల కోట్లకు పైగా కలెక్షన్స్ రావాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. ఈ మూవీకి ముందు నుంచి హాలీవుడ్ ప్రమాణాలతో రూపొందిస్తున్నారని.. భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా నిలవనుందనే టాక్.

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..

ఈ సినిమాలో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, నటుడు మాధవన్ కీలకపాత్రలు పోషిస్తున్నారని సమాచారం. మహేష్ బాబు కెరీర్ లోనే ఓ మైలు రాయిగా ఈ సినిమా నిలిచిపోవడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే పలు లొకేషన్లలో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగా.. ఇటీవల ఆఫ్రికా అడవుల్లో.. దక్షిణ అమెరికా, అమెరికా బేసిన్, ఐస్ లాండ్ వంటి విభిన్న ప్రదేశాల్లో షూటింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ను నవంబర్ 16న రిలీజ్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట.ఆ అప్డేట్ కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ స్థాయిలో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని.. ఆ వేడుకకు హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కామరూన్ సైతం హజరు అయ్యే ఛాన్స్ ఉందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.దీంతో ఈ సినిమాకు విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ ఏర్పడుందని సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు జక్కన్న.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి