Cinema : నిజ జీవిత సంఘటనలతో సినిమా.. 25 కోట్లతో తీస్తే రూ.340 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోనూ ట్రెండింగ్..
నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన ఆ మూవీ వసూళ్ల సునామీ సృష్టించింది. సామూహిక వలసల భయానక పరిస్థితుల నుంచి బయటపడడానికి పడిన కష్టాలు, సవాళ్ల మధ్య ఉనికి కోసం ఒక సమాజం చేసే పోరాటాన్ని ఈ సినిమా చూపిస్తుంది.

సాధారణంగా సినీ రంగుల ప్రపంచంలో నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతం ఆ జాబితాలోకి చెందినదే. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ ఉనికి కోసం ఒక సమాజం చేసే పోరాటాన్ని చూపిస్తుంది. అదే ది కాశ్మీర్ ఫైల్స్. ప్రపంచాన్ని కదిలించిన సినిమా ఇది. కేవలం 25 కోట్లతో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.340 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఈ చిత్రం 1990లలో కాశ్మీర్ లోయ నుండి కాశ్మీరీ హిందువుల వలసల కథను చెబుతుంది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలాంటి ప్రచారం లేకుండా అడియన్స్ ముందుకు వచ్చింది. పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో ఈ చిత్రానికి మంచి వసూల్లు రాబట్టింది. ఒక యువ కాశ్మీరీ హిందూ కళాశాల విద్యార్థి తన కుటుంబం గతం గురించి, వారు కాశ్మీర్ నుండి వలస వెళ్ళడానికి దారితీసిన పరిస్థితుల గురించి నిజం తెలుసుకునే కథ చుట్టూ అల్లుకుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
ఈ చిత్రానికి విమర్శకుల నుంచి మంచి రివ్యూస్ వచ్చాయి. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేశాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, మృణాల్ కులకర్ణి తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?




