Actor : ఒకప్పుడు లోకల్ రైళ్లల్లో పాటలు పాడిన కుర్రాడు.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఈ క్రేజీ హీరోను గుర్తుపట్టారా.. ?
ప్రస్తుతం అతడు అమ్మాయిల డ్రీమ్ బాయ్. కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన హీరో. కానీ మీకు తెలుసా.. ? అతడు ఒకప్పుడు ముంబైలోని లోకల్ రైళ్లలో పాటలు పాడేవాడు. ఇప్పుడు అదే కుర్రాడు ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

ప్రయత్నిస్తే ఓటమి దరిచేరదు.. ఈ మాట వినే ఉంటారు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోస్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో సైతం ఆ జాబితాలోకి చెందినవారే. ఒకప్పుడు ముంబైలోని లోకల్ రైళ్లల్లో పాటలు పాడుతూ డబ్బులు సంపాదించేవాడు. ఇప్పుడు అదే కుర్రాడు ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు. అంతేకాదు.. నివేదికల ప్రకారం అతడి ఆస్తులు రూ.80 కోట్ల వరకు ఉంటాయి. అతడు తన కెరీర్ ను టీవీ, రియాల్టీ షోలతో ప్రారంభించాడు. అతడి పేరు ఆయుష్మాన్ ఖురానా. చండీగఢ్‌లో జన్మించిన ఆయుష్మాన్ 2004లో ప్రముఖ రియాలిటీ షో ‘రోడీస్’ గెలిచిన తర్వాత ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
అతను తన కళాశాల రోజుల్లో రైళ్లలో ప్రయాణించేటప్పుడు గిటార్ వాయిస్తూ, పాటలు పాడేవాడినని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తన పాట నచ్చి డబ్బులు కూడా ఇచ్చేవారని.. ఆ డబ్బు తన ఖర్చులకు ఉపయోగపడిందని అన్నారు. నటన పై ఆసక్తితో ముంబై వచ్చిన అతడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. MBBS చేస్తున్న తన స్నేహితుడి హాస్టల్‌లో దాక్కుని, ఆడిషన్స్‌కు వెళ్లేటప్పుడు తన స్నేహితుడి కోటు వేసుకునేవాడు. చిన్న పట్టణంలో పెరగడం వల్ల అంత అందంగా లేకపోవడంతో, చాలా మంది చిత్రనిర్మాతలు అతన్ని ‘హీరో మెటీరియల్’గా తీసుకోలేదు.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
కానీ ఏమాత్రం పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత రేడియో జాకీగా పనిచేశాడు. 2012లో జాన్ అబ్రహం నిర్మాణ సంస్థ నిర్మించిన ‘విక్కీ డోనర్’ చిత్రంతో ఆయుష్మాన్‌కు పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సినిమా తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు. హిందీలో దమ్ లగా కే హైసా, అంధాధుంద్, డ్రీమ్ గర్ల్ వంటి చిత్రాల్లో నటించి వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు.
నివేదికల ప్రకారం ఆయుష్మాన్ ఆస్తులు రూ.80 కోట్లకు పైగానే ఉన్నాయట. ఇప్పుడు ఆయన నటిస్తోన్న థామ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..




