Bigg Boss Telugu 9: ‘బిగ్‌బాస్ తెలుగు 9’ ప్రైజ్ మనీ అనౌన్స్ చేసిన నాగార్జున.. ఈసారి ఎన్ని లక్షలో తెలుసా?
సాధారణంగా బిగ్ బాస్ రియాలిటీ షో విజేతలకు భారీగానే ప్రైజ్ మనీ అందుతుంది.అలాగే స్పాన్సర్ కంపెనీలు కూడా వివిధ రకాల బహమతులను అందజేస్తుంటాయి. లగ్జరీ కార్లు, గోల్డ్ ఛైన్స్ .. ఇలా రకరకాల కానుకలు విజేతలకు అందుతుంటాయి. అలా ఈ సీజన్ లో కూడా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమై ఎన్నో ట్విస్టులతో సాగిన ఈ రియాలిటీ షోకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుంది. డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలే ఫైనల్ ఎపిసోడ్ జరగనుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. టాప్-5 కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేను ప్లాన్ చేశారు మేకర్స్. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తో మరో ట్విస్ట్ ఇచ్చారు. శనివారం (డిసెంబర్ 13) నాటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా ఆదివారం ఎపిసోడ్ లో మరొకరు హౌస్ నుంచి బయటకు రానున్నారు. సుమన్ శెట్టి ఎలిమినేషన్ తర్వాత ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ మిగిలిపోయారు. తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజనా గల్రానీ, డిమాన్ పవన్, భరణిలో మరొకరు ఈరోజు ఎలిమినేట్ కానున్నారు. కాగా ఆదివారం నాటి ఎపిసోడ్ కు సంబంధించి వరుసగా ప్రోమోలు రిలీజవుతున్నాయి. ఈ నేపథ్యంలో లేటస్ట్ ప్రోమోలో బిగ్ బాస్ విజేతలకు అందించే ప్రైజ్ మనీని అధికారికంగా రివీల్ చేశారు హోస్ట్ నాగార్జున.
కాగా బిగ్‌బాస్ గత సీజన్ల మాదిరే ఈసారి కూడా విజేతకు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ అందుతుందని హౌస్ట్ నాగార్జున ప్రకటించారు. అయితే రన్నరప్ తో పాటు ఇతర టాప్-5 కంటెస్టెంట్స్ కు ఎంతెంత అమౌంట్ వస్తుందో మాత్రం నాగ్ చెప్పలేదు. అయితే విజేతలకు ఎంత ప్రైజ్ మనీ వచ్చినా ట్యాక్సుల రూపంలో భారీగా అమౌంట్ కట్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే విజేతలకు ప్రైజ్ మనీతో పాటు కొన్ని స్పాన్సర్స్ కంపెనీలు అందించే నగదు కానుకలు కూడా వస్తాయి. అంటే లగ్జరీ కార్డు, గోల్డ్ ఛైన్స్ తదితరాలు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కు వస్తాయన్నమాట.
ఇక లేటెస్ట్ ప్రోమో విషయానికి వస్తే… గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటే హౌస్‌లో ఎవరెవరికి ఎంతెంత ఇస్తారని కంటెస్టెంట్స్ ను అడిగాడు నాగార్జన. దీనికి మొదట భరణి తాను గెలుచుకున్న డబ్బు ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే ఆ లిస్ట్‌లో ఇమ్మాన్యుయేల్, పవన్‌లు ఉంటాన్నాడు. తాను గెలిస్తే రీతూ కోసం రూ. 5 లక్షలతో గిఫ్ట్ కొంటానని డిమాన్ పవన్ చెప్పారు.
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..
#NewGuyInTown team on the Bigg Boss stage! Get ready for the fun! 🔥✨
Watch #BiggBossTelugu9 Mon–Fri 10:00 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/8LVfRDu9iD
— Starmaa (@StarMaa) December 14, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








