AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: సక్సెస్ అంటే ఈ అమ్మాడిదే.. 5 వేలతో ఇండియాకు వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాల పాటకు కోట్ల రెమ్యునరేషన్..

ఒకప్పుడు కేవలం 5 వేల రూపాయలతో ఇండియాకు వచ్చి తినడానికి ఇబ్బంది పడిన అమ్మాయి, ఇప్పుడు కేవలం 5 నిమిషాల పాటకు కోట్లు సంపాదిస్తుంది. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఈ ముద్దుగుమ్మ.. తన ప్రతిభతో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగుతుంది.

Actress: సక్సెస్ అంటే ఈ అమ్మాడిదే.. 5 వేలతో ఇండియాకు వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాల పాటకు కోట్ల రెమ్యునరేషన్..
Nora Fatehi
Rajitha Chanti
|

Updated on: Oct 03, 2025 | 7:50 PM

Share

సినీరంగంలో గుర్తింపు తెచ్చుకోవాలంటే లుక్, ప్రతిభ మాత్రమే కాదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అంతేకాదు.. సినీ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, విమర్శలను స్వీకరిస్తూ ఆత్మ విశ్వాసంతో ప్రయత్నాలు చేసినవారు ఎప్పటికీ విజయం సాధిస్తారు. కష్టపడి పనిచేసే నటీనటులకు మంచి గుర్తింపు వస్తుంది. సినిమాల పట్ల ఇష్టం.. నటనపై ఆసక్తి ఉన్న ఓ విదేశీ అమ్మాయి.. ఇప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో సత్తా చాటుతుంది. వరుస సినిమాలు, ప్రకటనలతో దూసుకుపోతుంది. కేవలం 5 వేలతో ఇండియాకు వచ్చిన ఆ అమ్మాయి.. ఇప్పుడు 5 నిమిషాల పాటకు కోట్ల పారితోషికం తీసుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ నోరా ఫతేహి. కెనడాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ రూ. 5000 తో భారతదేశానికి వచ్చింది. చాలా కష్టాల తర్వాత ఆమెకు చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఐదు నిమిషాల పాటకు డ్యాన్స్ చేసినందుకు ఆమెకు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటుంది.

బాహుబలిలో “మనోహరి” పాటకు డ్యాన్స్ అదరగొట్టింది. అలాగే తొలినాళ్లలో ఆమె తినడానికి కూడా తిండి లేదు. కానీ ఇప్పుడు ఆమె చాలా సంపాదిస్తోంది. సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్ వంటి స్టార్ హీరోలతో నటించింది. సినిమాలో 5 నిమిషాలు నటించినా కోట్లలో పారితోషికం తీసుకుంటుంది. నోరా ఫతేహి ఫిబ్రవరి 6, 1992న కెనడాలోని మాంట్రియల్‌లో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. అందుకే ఆమె భారతదేశానికి వచ్చింది. నోరా తన కెరీర్‌ను హిందీ చిత్రం ‘రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్’తో ప్రారంభించింది. తరువాత, ఆమె ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రంలో మనోహరి, ‘టెంపర్’ చిత్రంలో ఇట్టాగే రెచ్చిపోదాం.. వంటి పాటలతో పాపులర్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

తాను ఇండియాకు వచ్చినప్పుడు కేవలం 5 వేలు మాత్రమే ఉన్నాయని.. తొమ్మిది మంది కలిసి 3BHK ఫ్లాట్ లో కలిసి ఉన్నామని చెప్పుకొచ్చింది. అప్పట్లో తన దగ్గర డబ్బులు కూడా లేవని.. తినడానికి తిండి లేకుండా ఇబ్బందిపడినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నోరా రోజుకు ఒక గుడ్డు, బ్రెడ్ మాత్రమే తినేదని. తాను సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం కళాకారులకు అవకాశాలు కొనే ఏజెంట్లు తీసుకునేవారని, వారు తనకు చాలా తక్కువ జీతం ఇచ్చారని ఆమె చెప్పింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi)

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం