AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Tarun : ఓటీటీలోకి రాజ్ తరుణ్ చిరంజీవ సినిమా.. ఆకట్టుకుంటున్న టీజర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా లవ్ స్టోరీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజ్ తరుణ్. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినీప్రయాణం స్టార్ట్ చేసిన రాజ్.. ఆ తర్వాత హీరోగా వెండితెరపై సక్సెస్ అయ్యాడు. కానీ కొన్నాళ్లుగా సినిమాల్లో అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. తాజాగా ఆయన హీరోగా నటిస్తోన్న చిత్రం చిరంజీవ..

Raj Tarun : ఓటీటీలోకి రాజ్ తరుణ్ చిరంజీవ సినిమా.. ఆకట్టుకుంటున్న టీజర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
Raj Tarun
Rajitha Chanti
|

Updated on: Oct 03, 2025 | 7:20 PM

Share

రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ “చిరంజీవ”. ఈ చిత్రంలో కుషిత కల్లపు హీరోయిన్ గా నటించింది. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. నవంబర్ 7వ తేదీ నుంచి చిరంజీవ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

చిరంజీవ మూవీ టీజర్ ఎంటర్ టైన్ మెంట్, లవ్, యాక్షన్ తో ఆకట్టుకుంది. శివ(రాజ్ తరుణ్)కు చిన్నప్పటి నుంచే స్పీడు ఎక్కువ. సైకిల్ ను కూడా జెట్ స్పీడ్ తో నడుపుతుంటాడు. అతని వేగాన్ని చూసినవారు ఆంబులెన్స్ డ్రైవర్ గా చేరమని సలహా ఇస్తారు. అలా ఆంబులెన్స్ డ్రైవర్ అయిన శివ ఒక అందమైన అమ్మాయి (కుషిత కల్లపు)ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత శివ కొన్ని పరిస్థితుల వల్ల సత్తు పైల్వాన్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సత్తు పైల్వాన్ ను నేను లేపేస్తా అని మాటిస్తాడు శివ. శివ తీసుకున్న మిషన్ అసాసిన్ ఏంటి అనేది టీజర్ లో ఆసక్తి కలిగించింది. చిరంజీవ సినిమా ఆహా ఓటీటీకి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కానుందని టీజర్ తో తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

ఈ సినిమా నవంబర్ 7 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. టీజర్ తోపాటే ప్రీమియర్ డట్ సైతం అనౌన్స్ చేశారు మేకర్స్. చిరంజీవ మీటర్ లో చాలా మేటర్ ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవ టీజర్ సినీప్రియులను ఆకట్టుకుంటుంది. కొన్నాళ్లుగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న రాజ్ తరుణ్.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..