- Telugu News Photo Gallery Can you squeeze lemon juice on chicken and eat it? What do the experts say?
చికెన్‌లో నిమ్మరసం పిండుకొని తినొచ్చా.? నిపుణలు ఏమంటున్నారు.?
చికెన్‌ను వండే కంటే ముందు మసాలాలు కలిపే సమయంలో చికెన్ రసాన్ని కలుపుతుంటారు. అలాగే చికెన్ పూర్తయిన తర్వాత కూడా నిమ్మ రసాన్ని పిండుకుని తింటుంటారు. అయితే చికెన్‌లో నిమ్మరసం పిండుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా.? అసలు ఇలా తీసుకోవడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా.? లేదా.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
Updated on: Dec 14, 2025 | 1:35 PM

ఆదివారం వచ్చిందంటే కచ్చితంగా వంటింట్లో చికెన్ ముక్క ఉడకాల్సిందే. నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వాటిలో చికెన్ ఒకటి. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించడం, వంటకం కూడా చాలా ఈజీగా ఉండడం, రుచిలో అమోఘంగా ఉండడం వంటి కారణాలన్నీ చికెన్‌ను ఎక్కువగా ఇష్టపడడానికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అయితే చికెన్‌లో నిమ్మరసం పిండుకోవడం సర్వసాధారణమైన విషయం.

చికెన్‌ను వండే కంటే ముందు మసాలాలు కలిపే సమయంలో చికెన్ రసాన్ని కలుపుతుంటారు. అలాగే చికెన్ పూర్తయిన తర్వాత కూడా నిమ్మ రసాన్ని పిండుకుని తింటుంటారు. అయితే చికెన్‌లో నిమ్మరసం పిండుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా.? అసలు ఇలా తీసుకోవడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా.? లేదా.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్‌లో నిమ్మరసాన్ని పిండుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

చికెన్‌లో నిమ్మరసం పిండుకోవడం వల్ల అందులోని ఆమ్లత్వం ప్రోటీన్స్‌ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో చికెన్ మరింత సాఫ్ట్‌గా తయారవుతుంది. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కారణంగా ప్రోటీన్స్ చిన్న చిన్న కణాలుగా విడిపోతుంటాయి. ఇది తీసుకున్న చికెన్ త్వరగా జీర్ణమవ్వడంలో ఉపయోగపడుతుంది. సాధారణంగా చికెన్ తినే సమయంలో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. కానీ నిమ్మకాయ పిండుకుని తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

ఇక కొంత మంది చికెన్‌ను స్కిన్‌తో తినడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వారికి కూడా నిమ్మ రసం ఉపయోగపడుతుంది. స్కిన్ నుంచి కొవ్వుని బ్యాలెన్స్ చేయడానికి నిమ్మరసం ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడంలో ఉపయోగపడుతుంది. ఇక చికెన్‌ను వండేముందు మేరినెట్ చేయడం సాధారణమైన విషయం. ఈ సమయంలో చికెన్‌లో నిమ్మరసం కలుపుతుంటారు. దీనివల్ల చికెన్ సరిగ్గా ఉడుకుతుంది.

ఇక నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది ఆహారం నుంచి ఐరన్‌ను గ్రహించేందుకు ఉపయోగపడుతుంది. చికెన్‌లో లీన్ ప్రోటీన్, అవసరమైన విటమిన్స్, బి6, బి12, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. చికెన్‌లో కాల్షియం కూడా ఉంటుంది. దీనిని సరిగ్గా గ్రహించేందుకు బాడీకి విటమిన్ సి అవసరం. చికెన్‌లో నిమ్మరసం కలుపుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండదు. పైగా లాభాలే ఉన్నాయి.




