- Telugu News Photo Gallery Eating carrots daily can reduce cancer risk and support blood sugar control, know health benefits
Carrots for Cancer: వారానికి 2 క్యారెట్లు తింటే.. జీవితంలో క్యాన్సర్ రాదట!
క్యారెట్లు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వారానికి రెండుసార్లు క్యారెట్లు తిన్నా పెద్ద వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. సలాడ్స్ దగ్గర్నుంచీ జ్యూస్‌ల వరకూ ఇలా ఎన్నో రకాలుగా తీసుకుంటారు. అయితే, పచ్చిగా ఎక్కువగా తీసుకోవడం ఇందులోని ఫైబర్ కారణంగా జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి..
Updated on: Dec 14, 2025 | 12:45 PM

క్యారెట్లు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వారానికి రెండుసార్లు క్యారెట్లు తిన్నా పెద్ద వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. సలాడ్స్ దగ్గర్నుంచీ జ్యూస్‌ల వరకూ ఇలా ఎన్నో రకాలుగా తీసుకుంటారు. అయితే, పచ్చిగా ఎక్కువగా తీసుకోవడం ఇందులోని ఫైబర్ కారణంగా జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి.

ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే మార్కెట్ కు తాజా కూరగాయలు, పండ్లు వస్తాయి. ముఖ్యంగా జామ, క్యారెట్లు తినేందుకు రుచికరంగా ఉంటాయి. తాజా క్యారెట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

తాజా క్యారెట్లు పచ్చిగా తింటే రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ క్యారెట్లతో వివిధ వంటకాలను కూడా తయారు చేస్తుంటారు. ప్రత్యేకత ఏమిటంటే ఈ క్యారెట్లు ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఇటీవలి అధ్యయనం ప్రకారం వారానికి 2 నుంచి 4 పచ్చి క్యారెట్లు తినడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు 17 శాతం తగ్గుతుంది.

క్యారెట్లలో కెరోటినాయిడ్లు, లుటిన్ వంటి సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఏదేమైనా క్యారెట్లను మీ రోజువారీ ఆహారంలో కాకపోయినా వారానికి కనీసం రెండుసార్లు తీసుకోవడం మంచిది. క్యారెట్లతో తయారు చేసిన స్వీట్లు లేదా ఇతర ఆహారాలు తినడం కంటే పచ్చి క్యారెట్లు తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.




