వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో
అమెరికాలో EAD వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నిర్ణయం వేలాది విదేశీ ఉద్యోగులపై, ముఖ్యంగా H-1B వీసాదారుల డిపెండెంట్లుగా వచ్చిన H-4 వీసా హోల్డర్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇకపై ప్రతిసారీ కొత్తగా దరఖాస్తు చేసుకోవడం పెద్ద ప్రక్రియగా మారింది. డెమోక్రాట్ సెనేటర్లు ఈ రూల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అమెరికాలో H-1B వీసా కాకుండా ఇతర వీసాలపై పనిచేయాలనుకునేవారు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) పొందాలి. ముఖ్యంగా H-1B వీసాదారుల డిపెండెంట్లుగా వచ్చే H-4 వీసా హోల్డర్లు ఈ EADని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, ట్రంప్ ప్రభుత్వం EADల ఆటోమేటిక్ రెన్యువల్ విధానాన్ని నిలిపివేసింది. ఇకపై EAD రెన్యువల్ కోసం ప్రతిసారీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అక్టోబరు 30 నుంచి అమల్లోకి రానుంది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ జారీ చేసిన ఈ ప్రకటన వేలాది మంది విదేశీ ఉద్యోగులపై, ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. EAD కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవడం అనేది సుదీర్ఘ ప్రక్రియ.
వైరల్ వీడియోలు
వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో
పంచాయతీ ఎన్నికల్లో భార్య ఓటమి..సెల్ టవర్ ఎక్కిన భర్త వీడియో
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్..
పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
