పంచాయతీ ఎన్నికల్లో భార్య ఓటమి..సెల్ టవర్ ఎక్కిన భర్త వీడియో
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భార్య ఓటమిని జీర్ణించుకోలేక ఖమ్మం జిల్లాకు చెందిన మాలోత్ రంగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, తన భార్యను అక్రమంగా ఓడించారని ఆరోపించారు. పలు గంటల పాటు సాగిన హైడ్రామా తర్వాత ఎమ్మార్వో హామీతో నిరసన విరమించారు. గతంలోనూ ఇలాగే నిరసన తెలిపిన రంగా, న్యాయం జరగకుంటే తిరిగి టవర్ ఎక్కుతానని హెచ్చరించారు
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. గ్రామాల్లో హై వోల్టేజ్ సృష్టించిన సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హరియా తండాలో ఓ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన తన భార్య ఓటమిని జీర్ణించుకోలేక, ఆమె భర్త మాలోత్ రంగా వినూత్న రీతిలో నిరసన తెలిపారు.గ్రామంలో ఎన్నో పనులు చేశానని, ఆపదలో అండగా ఉన్నానని, ఎంతో ఖర్చు పెట్టినా పంచాయతీ ఎన్నికల్లో తన భార్యను ఓడించారని రంగా ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన బానోత్ స్వాతి గెలుపొందగా, తమ ఓటమికి రిగ్గింగ్, అక్రమాలు కారణమని రంగా ఆరోపించారు.
వైరల్ వీడియోలు
పంచాయతీ ఎన్నికల్లో భార్య ఓటమి..సెల్ టవర్ ఎక్కిన భర్త వీడియో
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
జూ కీపర్పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్..
పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
