Rahul Gandhi:మెస్సీ మ్యాచ్ నిమిత్తం హైదరాబాద్‌కు రాహుల్‌గాంధీ.. స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం నిమిత్తం హైదరాబాద్‌లో జరుగుతున్న మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
హైదరాబాద్‌లో ప్రస్తుతం మెస్సీ మేనియా కొనసాగుతుంది. కాసేపట్లో ఉప్పల్ వేదికగా మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరగనుంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ మధ్య ఫుడ్‌బాల్ మ్యాచ్ కూడా జరగనుంది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహల్‌గాంధీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. అనంతం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడి నుంచి ఉప్పల్‌కు చేరుకోనున్నారు ఇద్దరు నేతలు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ మధ్య జరిగే ఫుడ్‌బాల్ మ్యాచ్‌ను రాహుల్ గాంధీ వీక్షించనున్నారు. అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్..
పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

