AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: శ్రీకాంత్ కొడుకుతో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరో

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అందులో ఒకరు శ్రీకాంత్ కుమారుడు రోషన్ ను ఈజీగా గుర్తు పడతారు. మరి రోషన్ పక్కనునన్నదెవరో తెలుసా? అతను కూడా ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. ప్రస్తుతం ఈ హీరో పేరు తెగ వినిపిస్తోంది.

Tollywood: శ్రీకాంత్ కొడుకుతో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరో
Mowgli Movie Hero Roshan Kanakala
Basha Shek
|

Updated on: Dec 14, 2025 | 2:14 PM

Share

సీనియర్ హీరో శ్రీకాంత్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రోషన్. మొదట 2015లో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రమ దేవి సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు. ఆ మరుసటి ఏడాది అంటే 2016లో వచ్చిన నిర్మలా కాన్వెంట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నాగ కోటేశ్వర రావు తెరకెక్కించిన ఈ టీనేజ్ లవ్ స్టోరీలో శ్రియా శర్మ హీరోయిన్ గా నటించింది. మన్మథుడు అక్కినేని నాగార్జున మరో కీలక పాత్ర పోషించాడు. కాగా ఇదే సినిమాలో రోషన్ స్నేహితులుగా ఇద్దరు స్టార్ కిడ్స్ కూడా నటించారు. పై స్టిల్ ఆ సినిమాకు సంబంధించినదే. అందులో రోషన్ పక్కనున్నదెవరో గుర్తు పట్టారా? రోషన్ లాగే కుర్రాడు కూడా స్టార్ కిడ్ కూడా. ఇప్పుడు అతను పెరిగి పెద్దవాడయ్యాడు. హీరోగా ఇండస్ట్రీకి కూడా పరిచయం అయ్యాడు . హీరో నటించిన ఒక సినిమా  శనివారమే (డిసెంబర్ 13) శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో హీరో పేరు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. మరి అతనెవరో పాటికే చాలా మంది కనిపెట్టేసి ఉంటారు. అందులో రోషన్ పక్కనున్నది మరెవరో కాదు స్టార్ యాకంర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల.

రోషన్ కనకాల హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మోగ్లీ. కలర్ ఫొటో ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ సినిమాను తెరకెక్కించాడు. శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. పుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన సినిమాకు మొదటి రోజు .1.22 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీంతో చిత్ర బృందం సంతోషంలో మునిగి తేలుతోంది.

ఇవి కూడా చదవండి

కుమారుడి సినిమా చూసి యాంకర్ సుమ ఎమోషనల్.. వీడియో

రోషన్ కనకాల హీరోగా నటించిన మొదటి సినిమా బబుల్ గమ్. 2023లో రిలీజైన సినిమా మోస్తరుగా ఆడిందిఆ తర్వాత ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ లోనూ ఓ కీలక పాత్ర పోషించాడు రోషన్. ఇప్పుడు మోగ్లీ సినిమాతో మరోసారి ఆడియెన్స్ ను పలకరించాడీ స్టార్ కిడ్. కాగా ఈ మూవీని యాంకర్ సుమ తన కుమారుడితో కలిసి థియేటర్ లో వీక్షించింది. తెరపై కొడుకు నటనను చూసి తీవ్ర భావోద్వేగానికి గురైంది. థియేటర్లోనే తన కుమారుడు రోషన్‌ను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మొదటి రోజు మోగ్లీకి భారీ కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.