55 ఏళ్ల వయసులో వరుస సినిమాలు.. రమ్యకృష్ణ ఆస్తులు ఎన్ని కోట్లంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
దక్షిణాదిలో దశాబ్దాలుగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు హీరోయిన్ రమ్యకృష్ణ. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే.
దాదాపు 40 ఏళ్ల సినీ కెరీర్, నాలుగు భాషల్లో 300 కి పైగా సినిమాల్లో నటించి, సెకండ్ ఇన్నింగ్స్‌లో పాన్-ఇండియా రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్నారు.
ఇప్పటికీ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది.
ఇదెలా ఉంటే ఆమె ఒక్కో సినిమాకు 3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఇప్పుడు ఆమె లైఫ్ స్టైల్, ఆస్తుల గురించి నెట్టింట సెర్చ్ చేస్తున్నారు.
నివేదికల ప్రకారం రమ్య కృష్ణ ఆస్తులు దాదాపు 200 కోట్ల రూపాయలు ఉన్నాయని సమాచారం. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో సొంత ఇళ్లు ఉన్నాయట.
అంతే కాదు, రమ్య కృష్ణకు కార్లంటే ప్రత్యేక ప్రేమ, ఆమె గ్యారేజీలో చాలా విలాసవంతమైన కార్లు ఉన్నాయని సమాచారం. అలాగే నగలపై ఆమెకు ప్రత్యేక ప్రేమ ఉంది.
ప్రస్తుతం రమ్య కృష్ణ వయసు 55 సంవత్సరాలు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజిగా ఉన్నారు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతమైన నటనతో కట్టిపడేస్తున్నారు.