AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: రూ.60 కోట్లు పెడితే 19 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో బ్లాక్ బస్టర్..

గతేడాది అడియన్స్ ముందుకు వచ్చిన ఓ సినిమా మిశ్రమ టాక్ తెచ్చుకుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమాకు అంతగా కమర్షియల్ హిట్ కాలేకపోయింది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం అత్యధిక వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతుంది. థియేటర్లలో ప్లాప్ అయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.

OTT Movie: రూ.60 కోట్లు పెడితే 19 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో బ్లాక్ బస్టర్..
The Family Star
Rajitha Chanti
|

Updated on: Jul 25, 2025 | 9:03 AM

Share

తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో జానర్ చిత్రాలు విడుదలవుతున్నాయి. నిత్యం కొత్త కొత్త కంటెంట్ చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో సూపర్ హిట్ అవుతున్నాయి. థియేటర్లలో అంతగా వసూళ్లు రాబట్టని సినిమాలు.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతున్నాయి. అయితే గతేడాది థియేటర్లలో విడుదలైన ఓ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దాదాపు ఏడాది తర్వాత ఈ చిత్రానికి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. అదే ది ఫ్యామిలీ స్టార్. 2024లో డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఇది.

ఈ సినిమా దాదాపు 450 రోజులకు పైగా ట్రెండింగ్‌లో ఉంది. కుటుంబ బాధ్యతల మధ్య సతమతమయ్యే ఓ మధ్య తరగతి కుర్రాడి కథే ఈ సినిమా. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించగా.. ప్రేమ, అహం, విముక్తి అనే అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. కుటుంబ బాధ్యతలతో నిండిన కష్టపడి పనిచేసే మధ్యతరగతి వ్యక్తి గోవర్ధన్ (విజయ్ దేవరకొండ), ఒక సీఈవో అయిన ఇందు (మృణాల్ ఠాకూర్) మధ్య ఏర్పడిన ప్రేమ .. వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పింది.. విభిన్న ప్రపంచాలు కలిగి ఇద్దరి మధ్య బంధం ఎలా ఏర్పడింది అనేది సినిమా.

ఆశయం,త్యాగం నేపథ్యంలో సాగే ఈ కథ, ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఒకరి జీవితాలను ఊహించని విధంగా ఎలా ప్రభావితం చేస్తారో తెలుపుతుంది ఈ సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ కలిసి 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.19 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి:

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!

Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..