Hari Hara Veeramallu Collections: హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్స్.. పవన్ కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటేస్ట్ మూవీ హరి హర వీరమల్లు. గత ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తుంది. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం (జూలై 24న)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.

బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన లేటేస్ట్ మూవీ హరి హర వీరమల్లు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రం ఇదే. దీంతో ఈ సినిమా కోసం పవన్ అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫస్ట్ పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ప్రతి అప్డేట్ పై ఓ రేంజ్ హైప్ నెలకొంది. దాదాపు ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య జూలై 24న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదలైంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మాస్, యాక్షన్ స్వాగ్ బిగ్ స్క్రీన్ పై చూడడంతో అభిమానుల సంతోషం గురించి చెప్పక్కర్లేదు.
ఈ సినిమాలో ఎప్పటిలాగే పవన్ యాక్టింగ్ అదిరిపోయిందని.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు అంటూ ట్విట్టర్ ఖాతాలో ఫ్యాన్స్ హడావిడి మాములుగా లేదు. ఇక విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్స్ తోపాటు ఓపెనింగ్ డే గురువారం భారీ స్థాయిలో థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఈ సినిమాకు భారీగా హైప్ ఉండడంతో ప్రీమియర్ షోతోపాటు ఓపెనింగ్ డే బెనిఫిడ్ షో, మార్నింగ్ షో, మ్యాట్నీ హౌస్ ఫుల్ షోలతో రన్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద తుఫానుగా నిలిచిన ఈ సినిమా పవన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.
పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం మొదటి రోజే మన దేశంలో రూ.31.50 కోట్లు రాబట్టినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రీమియర్ షోల ద్వారా ₹ 12.7 కోట్లు వసూలు చేసి, మొత్తం రూ.43.8 కోట్లు రాబట్టినట్లు సమాచారం. తెలుగు వెర్షన్ ప్రారంభ రోజున సగటున 57.39% ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
హరి హర వీరమల్లు ట్రైలర్..
ఇవి కూడా చదవండి:
Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!
Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..







