AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Darshan: హీరో దర్శన్‏కు బెయిల్.. హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..

రేణుకస్వామి హత్య కేసు నిందితుడు దర్శన్ బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే. అతడితోపాటు మరో 17 మంది నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది కర్ణాటక హైకోర్ట్. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ ఉత్తర్వును సుప్రీంకోర్టులో ప్రశ్నించింది. 'ఒక హైకోర్టు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడంలో అంత తప్పు చేయగలరా?' అని సుప్రీంకోర్టు నేరుగా ప్రశ్నించింది.

Actor Darshan: హీరో దర్శన్‏కు బెయిల్.. హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
Darshna
Rajitha Chanti
|

Updated on: Jul 25, 2025 | 8:08 AM

Share

మర్డర్‌ కేసులో నటుడు దర్శన్‌కు కర్నాటక హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా తప్పుపట్టింది. దర్శన్‌కు బెయిల్‌ ఇవ్వడం న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడమే అని స్పష్టం చేసింది. రేణుకస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దర్శన్ బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే.

కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శన్‌ అని రూల్స్‌ ఉల్లంఘించి బెయిల్‌ మంజూరు చేశారని కర్నాటక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తన అభిమాని రేణుకస్వామి హత్య కేసులో దర్శన్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దర్శన్‌కు బెయిల్‌ ఇవ్వడం న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడమేనని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితులకు బెయిల్ ఇవ్వడంపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఈ కేసులో దర్శన్‌తో పాటు పవిత్రా గౌడ కూడా నిందితురాలిగా ఉన్నారు. ఈ వారంలోనే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించడం ఇది రెండోసారి. హైకోర్టు తన పరిధిని సక్రమంగా వినియోగించకలేకపోయిందని పేర్కొంది. గతేడాది జూన్‌లో యూట్యూబర్ రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో దర్శన్‌తో పాటు అతడి ప్రియురాలు, నటి పవిత్రా గౌడ నిందితులుగా ఉన్నారు. ఆమెను వేధింపులకు గురిచేశాడనే ఆరోఫణలతో రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి చంపేశాడు.

నటుడు దర్శన్‌ తూగదీప, నటి పవిత్రా గౌడలకు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ) జస్టిస్ జే.బి. పార్దీవాలా, జస్టిస్ ఆర్. మాధవన్‌ల ధర్మాసనం విచారణ చేప్టింది. నిందితురాలు పవిత్ర గౌడ తరఫున లాయర్ వాదనలు వినిపిస్తుండగా.. ‘‘దోషిగా మేము నిర్దారించం కానీ… హైకోర్టు చేసిన తప్పు మేము చేయం’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హత్య కేసులో ‘అరెస్ట్ చేయడానికి కారణాలు పేర్కొనలేదు అనే వాదనలను హైకోర్టు ఎలా నమ్ముతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టు జడ్జి పొరపాటు చేశాడంటే సరే అనుకోవచ్చని , కానీ హైకోర్టు న్యాయమూర్తి అయితే ఎలా తప్పు చేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాగా, రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్రా గౌడ మరో 12 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలోని దర్శన్, పవిత్ర గౌడ ప్రధాన నిందితులనే ఆరోపణలు ఇలా ఉన్నాయి: పవిత్ర గౌడకు రేణుకాస్వామి అభ్యంతర మెసేజ్‌లు పంపడంతో దర్శన్ తన అనుచరులతో కలిసి అతడిని కిడ్నాప్‌ చేసి హత్య చేయించినట్టు అభియోగాలు నమోదయ్యాయి.

సుప్రీంకోర్టు ఇప్పుడు ప్రభుత్వ న్యాయవాదులు, దర్శన్ న్యాయవాదులు, పవిత్ర గౌడ న్యాయవాదుల వాదనలను విన్నది. ఆ తర్వాత కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. 10 రోజుల తర్వాత తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టు అభిప్రాయం ఇప్పుడు చాలా చర్చకు దారితీసింది.

ఇవి కూడా చదవండి:

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!

Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..