AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రక్తం వస్తోన్న పట్టించుకోకుండా యాక్టింగ్.. కట్ చేస్తే.. వెంటాడిన బ్యాడ్ లక్..

సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే అందం, అభినయంతోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాలి. హీరోయిన్‍గా స్టార్ స్టేటస్ సంపాదించుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారలలో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. నటిగా ప్రశంసలు అందుకున్నప్పటికీ సరైన బ్రేక్ రానీ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.

Tollywood: రక్తం వస్తోన్న పట్టించుకోకుండా యాక్టింగ్.. కట్ చేస్తే.. వెంటాడిన బ్యాడ్ లక్..
Charmy Kaur
Rajitha Chanti
|

Updated on: Feb 16, 2025 | 10:33 AM

Share

సినీ పరిశ్రమలో కథానాయికగా ఎదగాలని అనేక సవాళ్లను, అవమానాలను ఎదుర్కొన్న తారలు చాలా మంది ఉన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. కానీ నటనతో ప్రేక్షకులకు దగ్గరైనప్పటికీ అదృష్టం కలిసిరాని హీరోయిన్స్ కూడా ఉన్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. నటనతో ప్రశంసలు సంపాదించుకుంది.. కానీ ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు నిర్మాతగా మారి సినిమాలను నిర్మించింది. అయినప్పటికీ ఆమెను బ్యాడ్ లక్ వెంటాడింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ఇంకెవరు హీరోయిన్ ఛార్మీ కౌర్. రక్తం వస్తున్నప్పటికీ ఆగకుండా షూటింగ్ చేసిందంటూ ఆమె డెడికేషన్ పై మరోసారి ప్రశంసలు కురిపించారు డైరెక్టర్ కృష్ణవంశీ.

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఆమెకు అంతగా బ్రేక్ మాత్రం రాలేదు. నటిగా సినీరంగానికి దూరమైంది. కానీ నిర్మాతగా ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగులో మొత్తం 30 చిత్రాల్లో నటించింది. కానీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేకపోయాయి. మాస్, లక్ష్మీ, స్టైల్, మంత్రే, జ్యోతిలక్ష్మి వంటి చిత్రాలు ఛార్మి విజయాలు అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రభాస్ జోడిగా చక్రం, శ్రీ ఆంజనేయ, రాఖీ వంటి చిత్రాలకు డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. అయితే ఇందులో ఛార్మీ యాక్టింగ్ మరింత హైలెట్ అయ్యింది. కానీ ఈ సినిమాలు మిక్స్డ్ టాక్ అందుకోవడంతో ఛార్మీకి క్రేజ్ రాలేదు.

ఇవి కూడా చదవండి

గతంలో ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కృష్ణవంశీ మాట్లాడుతూ.. ఛార్మీ యాక్టింగ్ డెడికేషన్ పై ప్రశంసలు కురిపించారు. రక్తం వస్తున్నప్పటికీ ఆమె పట్టించుకోకుండా నటిస్తూనే ఉందని.. శ్రీ అంజనేయం, చక్రం వంటి చిత్రాల్లో కొన్నిసార్లు అలాంటి సంఘటన జరిగిందని.. ఆమెకు యాక్టింగ్ పట్ల ఉన్న ఇష్టాన్ని తెలిపారు. సెట్స్ లో ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటుందని.. మూడు చిత్రాల్లో ఛాన్స్ ఇచ్చి ట్రై చేశానని.. కానీ కుదరలేదని అన్నారు కృష్ణవంశీ. హీరోయిన్ గా కెరీర్ డౌన్ కాగానే నిర్మాతగా మారి సినిమాలను నిర్మించిందని.. అయినప్పటికీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు.

View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన