Cinema : రూ.5 కోట్లతో తీస్తే రూ.50 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో తుఫాను సృష్టించిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి..
ప్రస్తుతం థియేటర్లలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఎలాంటి హడావిడి, ప్రచారం లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన పలు సినిమాలు ఊహించని విధంగా అలరించాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా ఏకంగా రూ. 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ మీకు తెలుసా.. ? ఆ సినిమాను కేవలం రూ.5 కోట్లతోనే తెరకెక్కించారు.

ప్రస్తుతం తెలుగులో చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. రాజ్ వెడ్స్ రాంబాయి, లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే మలయాళీ చిత్రాలు సైతం దక్షిణాది సినీప్రియులను అలరిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాయి. మంచి కథ, కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మాత్రం వందల కోట్లు రాబట్టాయి. భారీ బడ్జెట్ చిత్రాలకు గట్టిపోటీ ఇస్తూ పాన్ ఇండియా లెవల్లో రికార్డులు కొల్లగొడుతున్నాయి. దీంతో కొత్త నటీనటులకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమాను కేవలం రూ.5 కోట్లతో నిర్మించగా.. ఏకంగా రూ.50 కోట్లు రాబట్టింది. ఆ సినిమా పేరు ఎకో.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
మలయాళీ నటీనటులు సందీప్ వినీత్, నరేన్, బినూ పప్పు, సౌరభ్ సచ్ దేవా కీలకపాత్రలు పోషించిన ఈ ఎకో చిత్రాన్ని దింజిత్ అయ్యతన్ తెరకెక్కించారు. మలయాళీ నటుడు జయరామ్ సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ నవంబర్ 21న విడుదలైన మంచి రివ్యూస్ అందుకుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే బాహుల్ రమేశ్ అందించారు. అలాగే మ్యూజిక్ ఈ సినిమాకు మరో హైలెట్ అని చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు రాబట్టింది. ఇన్నాళ్లు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.
ఇవి కూడా చదవండి : The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 31 నుంచి ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఆద్యంతం ఆకట్టుకునే కథాంశం, ఊహించని మలుపులతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..
ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.
