Cyber Crime: మీ పప్పులు ఇక్కడ ఉడకవురా.. సిమ్ కార్డులతో భారీ సైబర్ స్కామ్.. చెక్ పెట్టిన ఏపీ సీఐడి!
ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా రూటింగ్ చేసి, పెద్ద ఎత్తున సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాకు ఏపీ సీఐడీ చెక్ పెట్టింది. ఈ కేసులో ఓ వియత్నాం దేశీయుడితో పాటు మరికొందరిని అరెస్ట్ చేసింది. వీరు ‘సిమ్ బాక్స్’ అనే ప్రత్యేక పరికరం ద్వారా ఈ నేరానికి పాల్పడ్డట్టు సీఐడీ గుర్తించింది.

ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా రూటింగ్ చేసి, పెద్ద ఎత్తున సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేసింది ఏపీ సీఐడీ. ఓ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దాడులు చేపట్టి, ఈ క్రైమ్ నెట్‌వర్క్‌ను ఛేదించింది. ఈ ముఠాలో కీలకమైన వియత్నాం దేశీయుడితో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున సిమ్ బాక్సులు, వేల సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ‘సిమ్ బాక్స్’ అనే ప్రత్యేక పరికరం ద్వారా అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా రూట్ చేసి ఈ నేరానికి పాల్పడ్డట్టు సీఐడీ గుర్తించింది.
ఈ మొసాలకు పాల్పడుతున్న ముఠా చైనా వంటి దేశాల నుంచి సిమ్ బాక్స్‌లు దిగుమతి చేసుకొని.. వాటి ద్వారా సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి మొసాలకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు.వీరు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సుమారు ఇరవై కోట్ల వరకు మోసాలకు పాల్పడ్డారని సీబీఐ పేర్కొంది. వీరు కేవలం ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో మోసాలకు పాల్పడినట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజలకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. కొత్త సిమ్ తీసుకునేటప్పుడు కూడా ప్రజలు అలర్ట్‌గా ఉండాలని పోలీసులు సూచించారు. అలాగే ఏవైనా అనుమానిత కాల్స్ వస్తే.. సైబర్ క్రైమ్స్‌కు సంబంధించి 1930 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
