వైకుంఠ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే ధనం, ధాన్యానికి లోటే ఉండదు!
Samatha
27 December 2025
హిందువులు జరుపుకునే పండుగల్లో వైకుంఠ ఏకాదశి కూడా ఒకటి. ఈరోజు భక్తులందరూ విష్ణువును ఆరాధిస్తూ, ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
అయితే 2025లో వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 30న జరుపుకోనున్నారు. కాగా, ఈ రోజు కొన్ని పరిహారాలు చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయంట.
అన్ని ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు విష్ణువుతో భక్తి శ్రద్ధలతో పూజించి, కొన్ని పరిహాలు చేయడం వలన ఆర్థికంగా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు.
వైకుంఠ ఏకాదశి రోజు బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేచి స్నానం చేసి, విష్ణువును పూజించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం, చాల మంచిది, దీని వలన ఇంట్లో సంపద పెరుగుతుంది.
అలాగే ఈ రోజు విష్ణువుకు ఇష్టమైన నైవేద్యాలు చేసి, స్వామి వారికి సమర్పించాలి. ముఖ్యంగా పువ్వులు, గంధపు చెక్క, ధూపం, దీపాలు, పండ్లు , స్వీట్స్ సమర్పించడం వలన కోరిక కోర్కె నెరవేరుతుందంట
అలాగే ఈ రోజున విష్ణువుకు ఇష్టమైన తులసి మొక్కను నాటడం చాలా మంచిదంట. నైవేద్యాలలో తులసిని సమర్పించడం, తులసి నీరు పోయ్యడం చాలా మంచిది.
వైకుంఠ ఏకాదశి రోజున లక్ష్మీ చాలీసా పారాయణం చేయడం, హరే కృష్ణ, హరే కృష్ణ , కృష్ణ, కృష్ణ హరే, హరే, హరే రామ హరే రామ, రామ, రామ, హరే హరే, అని జపించడం వలన ఇంటిలో ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి.
అలాగే ఈ రోజున ఎవరు అయితే పేదలకు , బ్రహ్మణులకు, బాలికలు ఆహారం పెట్టడం, బట్టలు, పూలు, పండ్లు , స్వీట్స్ దానం చేస్తారో వారికి ఇంటిలో సంపదకు లోటు ఉండదంట.